USA vs Canada : టీ20 వరల్డ్ కప్ 2024 లో అతిథ్య దేశం అమెరికా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో కెనడాను చిత్తుచేసి తొలి విజయాన్ని అందుకుంది.
T20 World Cup 2024 : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లోని మొదటి మ్యాచ్‌లో అతిథ్య యూఎస్ఏ అద్భుతమైన బ్యాటింగ్ తో కెనడాను చిత్తు చేసింది. వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్ నమోదుచేసి చరిత్ర సృష్టించింది కెనడా. ఆ తర్వాతి ఇన్నింగ్స్ లోనే యూఎస్ఏ దానిని బ్రేక్ చేసింది. కెనడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. 195 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన అమెరికా జట్టు17.4 ఓవర్లలో 197 పరుగులతో టార్గెట్ ను ఛేదించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ 2024 లో తొలి విజయం అందుకున్న టీమ్ గా చరిత్ర సృష్టించింది.
వరల్డ్ కప్ లో కెనడా భారీ స్కోర్..
undefined
ఈ మ్యాచ్ లో యునైటెడ్ స్టేట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన కెనడా జట్టు 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నవనీత్ ధలీవాల్ (44 బంతుల్లో 61), నికోలస్ కిర్టన్ (31 బంతుల్లో 51) చేసిన అర్ధ సెంచరీలు చేయడంతో కెనడా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో శ్రేయాస్ మొవ్వా 16 బంతుల్లో 32 పరుగులతో చెలరేగడంతో 194 పరుగులు చేసింది. మొవ్వ చివరి ఓవర్ లో 21 పరుగులు రాబట్టాడు. అమెరికా తరఫున అలీఖాన్, హర్మీత్ సింగ్, కోరీ అండర్సన్ తలో వికెట్ తీశారు. కెనడా 194/5 ఇప్పుడు పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో అసోసియేట్ జట్టు ద్వారా అత్యధిక స్కోరుగా ఉంది, 2014లో నెదర్లాండ్స్ vs ఐర్లాండ్ చేసిన 193/4ని అధిగమించింది. ఆ తర్వాత దీనిని అమెరికా జట్టు బ్రేక్ చేసింది.
ఆరంభంలో తడబడి.. బ్యాటింగ్ లో అదరగొట్టిన ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్
195 పరుగులు భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన అమెరికా ఛేజింగ్ ఆరంభంలో కాస్త తడబడింది. 9 ఓవర్ వరకు మ్యాచ్ కెనడా వైపు ఉన్న తరుణంలో క్రీజులోకి ఎప్పుడైతే ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్ వచ్చారో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మార్చి పడేశారు. అద్భుతమైన బ్యాటింగ్ తో బౌండరీల వర్షం కురిపిస్తూ యూఎస్ఏకు వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని అందించారు. ఆరోన్ జోన్స్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్లు, సిక్సర్లతో కెనడా బౌలింగ్ ను చిత్తుచేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 పోర్లు, 10 సిక్సర్లు బాదాడు.
అలాగే, మరో ప్లేయర్ ఆండ్రీస్ గౌస్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 65 పరుగులు తన ఇన్నింగ్స్ తో 7 పోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్ లు 17.4 ఓవర్లలోనే 197 పరుగులతో యూఎస్ఏకు విజయాన్ని అందించారు. కెనడా బౌలర్లలో కలీం సనా, డిల్లాన్ హేలిగర్, నిఖిల్ దత్తాలు తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గ్రూప్ ఏ లో యూఎస్ఏ పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్లింది.
A marathon 131-run stand between Aaron Jones and Andries Gous power USA to an opening day victory over Canada 👊 | 📝 : https://t.co/xvy3gvUUKt pic.twitter.com/XcH1qTRMTa
— ICC (@ICC)