
T20 World Cup 2024 : న్యూయార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో బంగ్లాదేశ్‌ను భారత్ 60 పరుగుల తేడాతో ఓడించింది. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, హార్దిక్ పాండ్యా 40 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దుబేలతో పాటు ఇతర బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్ 122 పరుగులకే పరిమితమైంది.
రోహిత్ ఫ్యాన్ పై పోలీసులు..
అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. న్యూయార్క్ లోని నసావు స్టేడియంలో బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లో భారత కెప్టెన్ ను కలిసేందుకు మైదానంలోకి దూసుకువచ్చాడు రోహిత్ శర్మ అభిమాని. దీంతో కొద్ది సమయం పాటు మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ గార్డులు రంగంలోకి దిగి రోహిత్ తో కరచాలనం చేసి.. అతన్ని హగ్ చేసుకుంటున్న ఆ అభిమానిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Dinesh Karthik : 20 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్
ఈ క్రమంలోనే రోహిత్ అభిమానిని న్యూయార్క్ పోలీసులు బలంగా లాగి నెలపై పడేసి అదిమిపట్టుకుంటున్న సమయంలో.. హిట్ మ్యాన్ అతన్ని కొట్టవద్దనీ, సాధారణంగానే తీసుకువెళ్లండని అక్కడి పోలీసులను కోరాడు. ఆ అభిమాని పట్ల సౌమ్యంగా ప్రవర్తించాలనీ, అతడిని బాధపెట్టవద్దని రోహిత్ పోలీసులను కోరడం వీడియోలో కనిపించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ ఛేజింగ్‌లో ఈ సంఘటన జరిగింది.
IND VS BAN HIGHLIGHTS : బంగ్లాదేశ్ పై భారత్ గెలుపు.. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షో, పంత్ ఫిఫ్టీ