3.5 ఏళ్లు, 4 ఐసీసీ టోర్నీలు... గంభీర్ ఇది చేస్తే టీమిండియా ఇక క్రికెట్ బాసే !

By Mahesh Rajamoni  |  First Published Jul 10, 2024, 9:37 PM IST

Cricket  : భారత క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గా మాజీ ఓపెన‌ర్, ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ గౌత‌మ్ గంభీర్ ను నియ‌మితుల‌య్యారు. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ ప్ర‌క‌టించ‌గా, అత‌ని కాలంలో టీమిండియా 4 ఐసీసీ టోర్నీల‌ను ఆడ‌నుంది.
 


Cricket  : భారత క్రికెట్ లక్కీ చార్మ్ గౌతమ్ గంభీర్‌కు టీమిండియా కమాండ్‌ను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అప్పగించింది. భార‌త జ‌ట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును  బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు గౌత‌మ్ గంభీర్ కెరీర్ లో కొన‌సాగించిన విజ‌య‌వంత‌మైన యాత్ర‌ను టీమిండియా హెడ్ కోచ్ గా కొన‌సాగిస్తే టీమిండియా క్రికెట్ బాస్ కావ‌డం ఖాయం. భవిష్యత్తులో టీమ్ ఇండియా చరిత్రను మార్చ‌డం ప‌క్కా. ఎందుకంటే టీమిండియా బ్యాట‌ర్ గా ఉన్న స‌మ‌యంలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది భార‌త్. అలాగే, కేకేఆర్ కెప్టెన్, మెంట‌ర్ గా ఉన్న స‌మ‌యంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఐపీఎల్ లో బ‌ల‌మైన జ‌ట్టుగా ముందుకు న‌డిపించాడు.

భార‌త జ‌ట్టులో గౌతమ్ గంభీర్ కెరీర్ 15 ఏళ్లు కొనసాగింది. ఈ కాలంలో అతను అనేక రికార్డ్ బద్దలు కొట్టే ఇన్నింగ్స్‌లను ఆడాడు. టీమిండియాకు అనేక విజ‌యాలు అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్ అయినా, 2011 వన్డే ప్రపంచకప్ అయినా గంభీర్ జ‌ట్టు కోసం ఆడిన ఇన్నింగ్స్ ఎప్ప‌టికీ క్రికెట్ హిస్టారీలో నిలిచిపోతాయి.  ఫైనల్‌లో రెండు సార్లు, గంభీర్ టీమ్ ఇండియా కోసం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజయానికి విలువైన సహకారాన్ని అందించాడు. 2007లో గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు చేయగా, 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోనీతో కలిసి 97 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా టైటిల్ గెలవడంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

Latest Videos

undefined

కేకేఆర్ ను ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు 

గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2022లో లక్నో జట్టులో చేరాడు. ఈ జట్టు వరుసగా రెండు సీజన్లలో మంచి ప్రదర్శన కనబరిచింది. అలాగే, గంభీర్ 2024లో పాత ఫ్రాంచైజీ కేకేఆర్ జ‌ట్టుకు తిరిగి వచ్చాడు. అత‌ని కేకేఆర్ 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఈ జట్టు 10 సంవత్సరాల పాటు ట్రోఫీ కోసం ఆరాటపడింది. అయితే గంభీర్ మెంటార్‌గా తిరిగి రావడం జట్టుకు అదృష్టంగా మారింది. ఐపీఎల్ 2024లో గంభీర్ జట్టును గెలిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఫలితంగా కేకేఆర్ 10 సంవత్సరాల క‌ల‌ను నిజం చేస్తూ మ‌రోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

టీమిండియా చ‌రిత్రను మార్చే ఛాన్స్.. ! 

ప్లేయ‌ర్ గా, కెప్టెన్ గా, మెంట‌ర్ గా విజ‌య‌వంత‌మైన ప్ర‌యాణం త‌ర్వాత ఇప్పుడు గౌత‌మ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వ‌చ్చాడు. త‌న కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు సాగిన‌ ఈ నంబర్స్ గేమ్ ముందు కూడా కొనసాగిస్తే రాబోయే 3 సంవత్సరాలలో టీమ్ ఇండియా క్రికెట్ బాస్ కావ‌డం ప‌క్కా.. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా పదవీకాలం 3.5 సంవత్సరాలు.. ఈ స‌మ‌యంలో భార‌త జ‌ట్టు 4 ఐసీసీ టోర్నీలు ఆడ‌నుంది. భారత్ 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. దీని తర్వాత టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత 2026లో వన్డే ప్రపంచకప్ ను ఆడ‌నుంది. గంభీర్ ఈ టోర్నమెంట్లన్నింటికీ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసుకుని విజ‌యం సాధిస్తే భార‌త క్రికెట్ హిస్ట‌రీలో స‌రికొత్త అధ్యాయం లిఖిస్తాడు. టీమిండియా తిరుగులేని శ‌క్తిగా మార‌డం ఖాయం.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.. ! 

రోహిత్ శ‌ర్మ‌ను వెన‌క్కినెట్టిన జస్ప్రీత్ బుమ్రా.. !

కెప్టెన్ గా భార‌త జ‌ట్టులోకి తిరిగొస్తున్న కేఎల్ రాహుల్.. !

click me!