నేటి టాప్ టెన్ తెలుగు న్యూస్ ఇవే....

By telugu teamFirst Published Apr 1, 2020, 7:42 PM IST
Highlights

కరోనా వైరస్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏషియానెట్ న్యూస్ మీ కోసం నేటి పది టాప్ టెన్ వార్తలను అందిస్తోంది.

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంంది. కేవలం 12 గంటల్లో 43 కరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరుకుంది. వీరిలో 70 మంది ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. Read here

2. చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన సైరా చిత్రం అనుకున్నంత ఊపు ఇవ్వలేదు. దాంతో తదుపరి చిత్రంపై పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతు్న కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా పూర్తి కావడానికి సమయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.Read here

3. ఇండోనేషియాకు చెందిన మతప్రచారకులు రావడంతో కరీంనగర్ కరోనా వైరస్ తో గజగజలాడుతోంది. ఈ స్థితిలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మొబైల్ వ్యాన్స్ ద్వారా కూరగాయలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. Read here

4. కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు మందులు, ఆహారం అందించడానికి ఐఐటి విద్యార్థులు రోబోలను తయారు చేస్తున్నారు. కరోనా సోకినవారికి వైద్య సేవలు అందించేవారు కూడా ఆ వ్యాధి బారిన పడుతున్న స్థితిలో ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ నిర్ణయం తీసుకున్నారు.Read here

5. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా తన ప్రవర్తనను మార్చుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి అహారపు అలవాట్ల వల్లనే కరోనా వైరస్ పుట్టుకొచ్చిందనే అభిప్రాయం ఉంది. ఈ స్థితిలో కూడా వారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం లేదని అంటున్నారు. Read here

6. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆజం బాషాపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. తనపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.Read here

7. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయం మొత్తం దెబ్బ తిన్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జీతాలను వాయిదా వేసుకున్న ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.Read here

8. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనకు హాజరైనవారు ఐదు రైళ్లలో ప్రయాణం చేసినట్లు గుర్తించారు. దీంతో ఐదు రైళ్లలో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల గురించి రైళ్వే అధికారులు ఆరా తీస్తున్నారు.Read here

9. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అదరం కలిసి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. షాహిద్ అఫ్రిదీ ఫౌండేషన్ కు సాయం చేయాలని అనడంతో యువీపై విరుచుకుపడుతున్నారు.Read here

10. భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రాణాంతకమైన కరోనా వైరస్ పై పోరులో భాగస్వామి కానుంది. కొవిడ్ -19కు వ్యతిరేకంగా భారత్ చేసే పోరును బలోపేతం చేసేందుకు బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు.Read here

click me!