ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని, లాక్ డౌన్ ను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పాయి. అందుకు తగ్గట్టుగానే నేడు తాజాగా భారతీయ రైల్వేస్, విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ మొదలుపెట్టాయి.
కరోనా వైరస్.... ఈ పేరు చెబితే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఆ వైరస్ బారిన పడ్డాయి. ఆ వైరస్ సోకని దేశం దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారి ఇప్పుడు భారత దేశంపై కూడా పంజా విసురుతోంది.
భారత దేశంపై ఈ వైరస్ దండెత్తుతున్న వేళ భారతదేశమంతా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కంకణం కట్టుకుంది. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ కొనసాగడంతోపాటుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.
సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా సాగుతుంది. లాక్ డౌన్ మరిన్ని రోజులు పెరుగుతుందా అని. ఎవరికీ తోచిన రీతిలో వారు థలా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ... లాక్ డౌన్ ఇంకో మూడు నెల్ల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు.
నిన్న ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని, లాక్ డౌన్ ను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పాయి. అందుకు తగ్గట్టుగానే నేడు తాజాగా భారతీయ రైల్వేస్, విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ మొదలుపెట్టాయి.
ఒకవేళ గనుక లాక్ డౌన్ ఎక్స్టెండ్ అయితే... డబ్బులు తిరిగి బుక్ చేసుకున్నవారు ఖాతాలకు తిరిగి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. దీనికి సంబంధించి ఏప్రిల్ 12న సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇకపోతే భారతదేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిజాముద్దీన్ లో ప్రార్థనల్లో పాల్గొన్నవారు దేశమంతా తిరగడంతో కరోనా వ్యాప్తి భయం ఇప్పుడు మరింత ఎక్కువయింది.
ఢిల్లీలోని తబ్లిగ్ ఈవెంట్ కు సంబంధించి మాత్రమే ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా 91 కేసులు నమోదయ్యాయి. చెన్నైలో 57 మంది పాజిటివ్ గా తేలితే... అందులో 50 మంది ఢిల్లీలోని ఈ తబ్లిగ్ సంస్థ ప్రార్థనలకు హాజరయ్యి వచ్చారు.
ఈ ఈవెంట్ కు సంబంధించి ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ లో ఒక మృతి సమ్హవించగా తెలంగాణలో 6మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 24 కేసులు,తమిళనాడులో 50 కేసులు, లో 10 కేసులు నమోదయ్యాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి చాలా భయానకంగా కనబడుతుంది.