నిజాముద్దీన్‌కు వెళ్లిన వారంతా స్వచ్ఛంధంగా పరీక్షలు చేసుకోవాలి: బొత్స

By narsimha lodeFirst Published Apr 1, 2020, 11:01 AM IST
Highlights

ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో సన్నిహితంగా మెలిగినవారు కూడ పరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు.

అమరావతి:ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో సన్నిహితంగా మెలిగినవారు కూడ పరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు.

బుధవారం నాడు ఉదయం ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు.రెండు రోజుల నుండి ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయన్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో కేవలం 24 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైన విషయాన్నిఆయన గుర్తు చేశారు.

also read:అమరావతి భూములపై సుప్రీంకెక్కనున్న జగన్ ప్రభుత్వం

 ప్రతి ఒక్కరు కూడ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.
కరోనా విషయమై సీఎం ప్రతి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. 

ముస్లింలు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేసిన వినతిని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్టల్స్ ఉండే విద్యార్థుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులతో పాటు వలస కార్మికులు, యాచకులు, అనాధలకు భోజన వసతి కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టుగా మంత్రి తెలిపారు. 

ఫంక్షన్ హాల్స్, హాస్టల్స్ లో భోజన వసతిని కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడ 
ఆకలితో బాధ పడకుండా ఉండాలనేది తమ ప్రభుత్వ అభిమతమని బొత్స చెప్పారు.

వైద్య, ఆరోగ్య శాఖకు  నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉన్న వారు కూడ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.


 

click me!