కృష్ణా జిల్లాలో 32 రెండు పాజిటివ్ కేసులు అని శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. ఈ రోజు వచ్చిన హెల్త్ బుటెలిన్‌లో కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య 28కి తగ్గించారని, దీని వెనుక ఉన్న మతలబు ఏంటో జగన్ గారికే ఎరుకంటూ పంచుమర్తి సెటైర్లు వేశారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ఫైరయ్యారు. కరోనాపై వైసీపీ ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయని ఆరోపించారు. మొదటి నుంచి సీఎం జగన్ కరోనా నివారణకు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారని ఆమె అన్నారు.
Also Read:తిరుపతి రుయా, స్విమ్స్ మధ్య సమన్వయలోపం: అంబులెన్స్‌లోనే ఆరుగురు కరోనా రోగులు
ప్రభుత్వం చేస్తున్న టెస్టులు తక్కువని, బయటకు ఇస్తున్న లెక్కలు తప్పుల తడకని అనూరాధ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో 32 రెండు పాజిటివ్ కేసులు అని శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు.
ఈ రోజు వచ్చిన హెల్త్ బుటెలిన్‌లో కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య 28కి తగ్గించారని, దీని వెనుక ఉన్న మతలబు ఏంటో జగన్ గారికే ఎరుకంటూ పంచుమర్తి సెటైర్లు వేశారు. 29 వేల మంది విదేశాల నుంచి వచ్చారని ప్రభుత్వమే చెబుతోందని చేసిన టెస్టులు 3 వేలు కూడా దాటలేదని ఆమె అన్నారు.
Also Read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: తూర్పు గోదావరిలో ఫాస్టర్ అరెస్ట్
మరణాల విషయంలో కూడా ప్రభుత్వం లెక్కలు దాస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయని అనూరాధ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేయాలని పంచుమర్తి అనూరాథ హితవు పలికారు.
కరోనా పై వైకాపా ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయి.మొదటినుండి ముఖ్యమంత్రి జగన్ గారు కరోనా నివారణకు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.ప్రభుత్వం చేస్తున్న టెస్టులు తక్కువ,బయటకు ఇస్తున్న లెక్కలు తప్పుల తడక.(1/4) pic.twitter.com/adliXhM69G
— PANCHUMARTHY ANURADHA TDP #StayHomeSaveLives (@AnuradhaTdp)