రూ. 1000 పంపిణిలో అవకతవకలు నిరూపిస్తే చర్యలు: విపక్షాలకు వైసీపీ సవాల్

By narsimha lodeFirst Published Apr 5, 2020, 3:32 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో విపక్షాలు రాజకీయ విమర్శలకు దిగుతున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. 

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో విపక్షాలు రాజకీయ విమర్శలకు దిగుతున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. 

ఆదివారం నాడు మధ్యాహ్నం వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు  అమరావతిలో మీడియాతో  మాట్లాడారు.కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటంలో దేశం ఐక్యంగా ఉందని చాటిచెప్పేందుకు గాను ఇవాళ రాత్రి 9 గంటల పాటు 9 నిమిషాల పాటు  లైట్లు ఆర్పి వేయాలని ఆయన కోరారు.

దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరైంది కాదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.

కరోనాను ఎదుర్కొనేందుకు దేశమంతా పోరాటం చేస్తుందన్నారు. లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితులు దెబ్బతిన్నాయన్నారు. కరోనాతో ఇబ్బందిపడుతున్న పేదలను ఆదుకొనేందుకు ప్రభుత్వం తీసుకొన్న విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు.

కరోనా విపత్తుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి విమర్శలు చేయడానన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. విపక్షాలు చేసే సద్విమర్శలను ప్రభుత్వం తప్పకుండా స్వీకరించనున్నట్టుగా ఆయన తెలిపారు.

Also read:తిరుపతి రుయా, స్విమ్స్ మధ్య సమన్వయలోపం: అంబులెన్స్‌లోనే ఆరుగురు కరోనా రోగులు

పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయాలను పంపిణీ చేసే సమయంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైసీపీకి ఓటేయాలని కోరుతున్నారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అంతేకాదు వెయ్యి రూపాయాల్లో కూడ కొంత నగదును కట్ చేసుకొని లబ్దిదారులకు ఇస్తున్నారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన తెలిపారు. 

అయితే వెయ్యి రూపాయాల్లో కూడ కొంత నగదును కట్ చేసుకొని ఇస్తున్నారని కూడ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఉద్దేశించిన ఈ నగదు పంపిణీలో ఎక్కడైన అవకతవకలకు పాల్పడినట్టుగా  నిరూపిస్తే  బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.


 

click me!