ఏపీ లో కొత్తగా 159 కరోనా కేసులు, ఒక మరణం.. మ‌రోవైపు ఒమిక్రాన్ టెన్ష‌న్..!

Published : Dec 02, 2021, 06:34 PM IST
ఏపీ లో కొత్తగా 159 కరోనా కేసులు, ఒక మరణం.. మ‌రోవైపు ఒమిక్రాన్  టెన్ష‌న్..!

సారాంశం

గ‌త కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. గడిచిన 24 గంటల్లో 159 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో  రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసు లకు కాగా..  ఇప్ప‌టివర‌కూ 20,53,775 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 14,444 మంది మరణించారు. ప్రస్తుతం 2,138 మంది చికిత్స పొందుతూన్నారు.  

AP Corona cases: ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టు క‌నిపించినా.. గ‌త కొద్ది రోజులుగా.. కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. గడిచిన 24 గంటల్లో 159 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,70,357 కి చేరుకుంది. ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ఒకరు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,444కి చేరుకుంది. 

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 169 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,53,775 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 29,263 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,04,75,940 చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,138 మంది చికిత్స పొందుతున్నారు. 

read also:https://telugu.asianetnews.com/coronavirus/omicron-central-government-tightens-covid-rules-for-passengers-r3heaz

నిన్న ఒక్కరోజు అనంతపురం 13, చిత్తూరు 23, తూర్పుగోదావరి 10, గుంటూరు 18, కడప 2, కృష్ణ 15, కర్నూలు 1, నెల్లూరు 18, ప్రకాశం 2, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 28, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 21 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

https://telugu.asianetnews.com/telangana/160-new-corona-cases-reported-in-telangana-r38lws

గ‌త కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. గడిచిన 24 గంటల్లో 159 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసు లకు కాగా..  ఇప్ప‌టివర‌కూ 20,53,775 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 14,444 మంది మరణించారు. ప్రస్తుతం 2,138 మంది చికిత్స పొందుతూన్నారు.
 
PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి