కేసీఆర్ బాటలో జగన్: ప్రభుత్వోద్యోగులకు రెండు విడతలుగా వేతనం

By Siva KodatiFirst Published Mar 31, 2020, 4:13 PM IST
Highlights

కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత విధించారు.

కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత విధించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వోద్యోగులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Also Read:పేద రాష్ట్రాలే కోత పెట్టలేదు: కేసీఆర్ పై మండిపడుతున్న ఉద్యోగులు

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో  సగం వేతనం, నిధులు సర్దుబాటు అయ్యాక మిగిలిన సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని సూర్యనారాయణ అన్నారు.

ఈ సంక్షోభ సమయంలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు తాము అంగీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒక్క నెలలో మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.

కాగా ప్రస్తుత విపత్కర కాలంలో ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తూ సోమవారం రాత్రి తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత: ఎవరెవరికి ఎంతెంతనంటే...

అదే సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు. అలాగే అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం (నాలుగో తరగతి మినహా), నాలుగో తరగతి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం చొప్పున కోత పడనుంది. అంతేకాకుండా అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల ఫించన్లలో 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల ఫించన్లలో 10 శాతం కోత విధించనున్నారు. 

click me!