రూ.400 కోట్ల వ్యవస్థ... అయినా రేషన్ సరుకులు ఇంటికి చేర్చలేరా: నారా లోకేశ్

By Arun Kumar PFirst Published Mar 31, 2020, 3:59 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లాక్ డౌన్ అవడంతో  తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని కోరారు. రైతులను ఆదుకోడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోందని... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. 

''రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పండించిన పంటకి మద్దతు ధర రావడం లేదు. కనీసం వేరే ప్రాంతాలకు తరలించడానికి రవాణా సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు'' అంటూ అన్నధాతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 
 
''హార్టీ కల్చర్, ఆక్వా రంగంలో ఉన్న రైతుల కష్టాలు వర్ణనాతీతం. కూలీలు,గిట్టుబాటు ధర లేక వరి పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.  ఒక్క సారి రైతు దెబ్బ తింటే కోలుకోవడం చాలా కష్టం. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ సీఎం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను'' అని అన్నారు.  

''కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల్ని రేషన్ కోసం రోడ్ల పై నిలబెట్టడం శ్రేయస్కరం కాదు. రేషన్ కోసం ఎండలో నిలబడి విశాఖపట్నం ద్వారకా నగర్ లో వృద్ధురాలు షేక్ మేరబీ మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది'' అంటూ నానా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
''నెలకు 400 కోట్ల ప్రజా ధనంతో నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థతో రేషన్ ఇంటికి అందించాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికన నిలదీశారు లోకేశ్. 

click me!