ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు: ఆ 39 మంది కోసం పోలీసుల గాలింపు

By Siva KodatiFirst Published Mar 31, 2020, 3:44 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఒక్కసారిగా 40 కేసులకు పెరగడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరడం కలకలం రేపుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఒక్కసారిగా 40 కేసులకు పెరగడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరడం కలకలం రేపుతోంది.

Also Read:వారి భార్యలకూ కరోనా పాజిటివ్: ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చినవారి లెక్కలు ఇవీ....

జిల్లా నుంచి 184 మంది ఢిల్లీలోని నిజాముద్దిన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 145 మందికి కోవిడ్ 19  పరీక్షలు చేయగా.. వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

మిగిలిన 39 మంది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని ప్రజలు లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడంలో ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ పిలుపునిచ్చారు.

Also Read:ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక

కొత్తగా వెలుగు చూసిన కరోనా కేసులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన 39 మంది ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని.. ఈ కుటుంబాలకు చెందిన వారు స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ డిమాండ్ చేశారు. గతంలో నెగిటివ్ వచ్చిన 18 మంది సైతం 28 రోజులు క్వారంటైన్ పాటించాల్సిందేనని శామ్యూల్ ఆదేశించారు. 

click me!