Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Omicron Cases in AP: భారత్ లో కరోనా వేరియంట్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. తన పంజా ఝూళిపిస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయిలో జడలు విప్పుకుంటోంది.. మొన్నటి వరకు నిద్రాణంగా ఉన్న ఆ మహమ్మారి కోరలు చాస్తూ స్వైరవిహారం చేస్తోంది. మిగితా రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించాయి. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కొన్ని చర్యలు తీసుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలను మూసేశాయి. పలు నగరాలలో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఢిల్లీలో అయితే రెడ్ అలర్ట్ ఆంక్షలు విధించబోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. తాజాగా ఒమిక్రాన్ కేసుల్లో ఎక్కువ విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారే ఉన్నారు. ఒమిక్రాన్ పాజివిట్ గా నిర్థారణ అయినవారిలో ఓమన్ నుంచి ఇద్దరు మహిళలు , దుబాయ్ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందనీ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు. వీరందర్నీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది.
undefined
Read Also: తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 1000 కేసులు, ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి
మరో వైపు.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందిని పరీక్షించగా.. వారిలో 334 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు. అదే సమయంలో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. మరో 95 మంది ఈ వేరియంట్ నుం\చి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read Also: coronavirus: కరోనా సోకినా.. ఆక్సిజన్ అవసరమయ్యేవారు తక్కువే..!
దేశవ్యాపంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,379 కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. భారత్ లో టీకా పంపిణీ కూడ శరవేగంగా జరుగుతోంది. ఒక్క సోమవారం మరో 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.