AP Corona cases: ఏపీలో త‌గ్గిన క‌రోనా.. పెరిగిన ఓమిక్రాన్ టెన్ష‌న్

By Rajesh K  |  First Published Dec 13, 2021, 5:21 PM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… త‌రుగుతూ ఉన్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,010 శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 108 మందికి పాజిటివ్​ వ‌చ్చిన‌ట్టు గుర్తించారు. అదే స‌మ‌యంలో ఒక‌రు కోవిడ్ బారిన ప‌డి మృతి చెందిన‌ట్టు తెలిపారు వైద్య అధికారులు.
 


AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు గ‌తంతో పోలిస్తే.. కొద్దిగా తగ్గాయి. కొత్తగా 108 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) నిర్థార‌ణ అయిన‌ట్టు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంట‌ల్లో  21,010 శాంపిళ్లను పరీక్షించిన‌ట్టు వెల్లడించింది ఏపీ ఆరోగ్య శాఖ‌. ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో క‌రోనా కారణంగా ఒక‌రు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 14,467 చేరింద‌ని తెలిపింది. అలాగే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 141 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టు ఏపీ ఆరోగ్య శాఖ‌ వెల్లడించింది. దీంతో ఇప్పటి వ‌ర‌కూ మొత్తం 20,55,736 మంది డిశ్చార్జ్ అయిన‌ట్టు తెలిపింది.  అదే క్ర‌మంలో 1,878 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,07, 98, 406  శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,74, 976 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటి వరకు 20,58,631 మంది కరోనాను జయించగా.. 14,467 మంది క‌రోనా​కు బలయ్యార‌ని బులిటెన్ లో వెల్ల‌డించారు.


జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 03, చిత్తూరు జిల్లాలో 36, తూర్పుగోదావరి జిల్లాలో 17,  గుంటురూ జిల్లాలో 6, కడప జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో 5, కర్నూలులో 00, నెల్లూరు జిల్లాలో 5,  ప్ర‌కాశం లో 7,  శ్రీకాకుళం జిల్లాలో 3 , విశాఖపట్నం లో 20, విజయనగరం జిల్లాలో 00, పశ్చిమగోదావరి జిల్లాలో 02 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Latest Videos

undefined

Read Also: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !

ఇదిలా ఉంటే.. ఏపీలో ఒమిక్రాన్ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది.   ఇటీవల ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నా ఒమిక్రాన్ ఎంట్రీతో జనం హడలిపోతున్నారు.  

Read Also: బూస్ట‌ర్ డోసు అత్య‌వ‌స‌ర‌మేమీ కాదు - ఐసీఎంఆర్

మరోవైపు..  యూకే నుంచి ఢిల్లీ మీదుగా తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. తిరుపతిలోని పెద్దకాపు వీధికి చెందిన వ్య‌క్తి కి ఇదివరకే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆయ‌న యూకే నుంచి ఈ నెల 8వ తేదీన ఢిల్లీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.  ఈ క్రమంలో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. 

click me!