మీ ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోండిలా..

By rajesh yFirst Published Apr 12, 2019, 2:48 PM IST
Highlights

ఎవరైతే ఆదాయపుపన్ను అదనంగా డిపాజిట్ చేశారో.. వారు తిరిగి ఆ మొత్తాన్ని పొందేందుకు ఆదాయపుపన్ను శాఖ అనుమతించింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ  పోర్టల్‌(www.incometaxindiaefiling.gov.in)లో క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది. 

ఎవరైతే ఆదాయపుపన్ను అదనంగా డిపాజిట్ చేశారో.. వారు తిరిగి ఆ మొత్తాన్ని పొందేందుకు ఆదాయపుపన్ను శాఖ అనుమతించింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ  పోర్టల్‌(www.incometaxindiaefiling.gov.in)లో క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది. 

ఆదాయపుపన్ను నిబంధనల ప్రకారం.. 2.5లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వార్షికాదాయం పొందుతున్న వారు ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే. సీనియర్ సిటిజెన్స్(60-80ఏళ్లు) వారికి ఆదాయ పరిమితి రూ.3లక్షల వరకు ఉంది. వెరీ సీనియర్ సిటిజన్స్(80ఏళ్లకు పైబడినవారు)కు రూ. 5లక్షల ఆదాయ పరిమితి ఉంది.

ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిఫండ్ క్లైయిమ్ చేసుకునే విధానం:

1. ఇన్‌కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చాతో లాగిన్ కావాల్సి ఉంటుంది.

2. ఆ తర్వాత స్క్రీన్‌పైన ఉన్న ‘డ్యాష్‌బోర్డ్’ పక్కనే ఉన్న ‘మై అకౌంట్’ ట్యాబ్‌కు వెళ్లాలి. అనంతరం ‘రిఫండ్ రీ ఇష్యూ రిక్వెస్ట్’ క్లిక్ చేయాలి.

3. ప్యాన్ నెంబర్, సీపీసీ కమ్యూనికేషన్ రెఫరెన్స్ నెంబర్, రిఫండ్ సీక్వెన్స్ నెంబర్(143(1)లభ్యమవుతుంది) ఇంటిమేషన్ ఆర్డర్ ఇచ్చి.. ఆ తర్వాత వ్యాలిడేట్ బటన్ నొక్కాలి.

4. వ్యాలిడేట్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఈసీఎస్ లేదా చెక్కు ద్వారా మోడ్ ఆఫ్ రిఫండ్ ఎంపిక చేసుకోవాలి.

5.  'Do you want to update Bank Account details?' అనే ఆప్షన్ కింద మీరు మీ బ్యాంక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి.

6. చెక్కు ద్వారా రిఫండ్ పొందాలనుకుంటే సరైన చిరునామాను తెలియజేయాలి. Address provided in the ITR uploaded' or 'address provided in the PAN' అనేది స్పష్టం చేయాలి.

7. ఆ తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సరైన పన్ను  చెల్లింపుదారులైతే  మీకు సక్సెస్ మెసేజ్ వస్తుంది. 
 
రిఫండ్/డిమాండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి:

1. ఇన్‌కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చాతో లాగిన్ కావాల్సి ఉంటుంది.

2. ఆ తర్వాత ‘మై అకౌంట్’ ట్యాబ్‌కి వెళ్లి ‘రిఫండ్/డిమాండ్ స్టేటస్’పై క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాతి పేజిలో అసెస్మెంట్ ఇయర్, స్టేటస్, రీజన్, మోడ్ ఆఫ్ పేమెంట్ కనిపిస్తుంది. రిఫండ్/డిమాండ్ స్టేటస్ కూడా టాక్స్ పేయర్ చూసుకోవచ్చు.

click me!