Vivo T4x vs CMF Phone 1: వివో T4x వర్సెస్ ఫోన్ 1.. ఏది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్?

Published : Mar 09, 2025, 07:50 PM IST
Vivo T4x vs CMF Phone 1: వివో T4x వర్సెస్ ఫోన్ 1.. ఏది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్?

సారాంశం

Vivo T4x vs CMF Phone 1: ప్రస్తుతం మార్కెట్ లో Vivo T4x 5G, CMF ఫోన్ 1.. ఈ రెండు ఫోన్లు పోటాపోటీగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం ఈ రెండింటిలో వేర్వేరు ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ, డిస్ ప్లే, డిజైన్, ప్రాసెసర్, కెమెరా విభాగాల్లో ఏది బెస్ట్ ఫోనో ఇప్పుడు తెలుసుకుందాం. 

వివో కంపెనీ T3x 5G ఫోన్ సక్సెస్ తర్వాత, ఆ కంపెనీ రీసెంట్‌గా వివో T4x 5Gని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ LCD ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, డ్యూయల్ కెమెరాలు, బ్యాటరీ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. అందుకే ఈ ఫోన్ CMF ఫోన్-1కి పోటీగా నిలిచింది. ఇది జులై 2024లో మార్కెట్‌లోకి వచ్చింది. దీనిలో రిమూవబుల్ బ్యాక్ ప్యానెల్, అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఉన్న ఫీచర్లను పోల్చి చూసి ఏది బెస్ట్ ఫోనో తెలుసుకుందాం.  

వివో T4x వర్సెస్ ఫోన్ 1: డిస్‌ప్లే

వివో T4x 5Gలో 6.72 అంగుళాల LCD స్క్రీన్ ఉంది. దీనికి 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ ఉన్నాయి. ఇది మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం రైన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్‌ను, 1,050 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. చేతులు తడిగా ఉన్నా కూడా ఈ గ్యాడ్జెట్‌ను టచ్ చేయొచ్చు.

అదే CMF ఫోన్ 1లో 6.67 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ ఉన్నాయి. ఇది HDR10+ సపోర్ట్‌తో బాగా పనిచేస్తుంది. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 2,000 నిట్స్. అంతేకాకుండా అమోల్డ్ ప్యానెల్‌లో ఎక్కువ కాంట్రాస్ట్ రేషియో, 240Hz టచ్ శాంప్లింగ్ ఉన్నాయి. దీనివల్ల డిస్‌ప్లే మరింత కలర్‌ఫుల్‌గా, ఫ్లూయిడ్‌గా ఉంటుంది.

ఇది కూడా చదవండి ఫ్లిప్ కార్ట్‌లో భారీ ఆఫర్! శాంసంగ్ గెలాక్సీ S23పై రూ.50,000 వరకు తగ్గింపు!

 

వివో T4x వర్సెస్ ఫోన్ 1: డిజైన్

వివో T4x 5G ప్రొంటో పర్పుల్, మెరైన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. దీని ఫినిషింగ్ చాలా బాగుంటుంది. దీని మందం 8.09 మిమీ. అంతేకాకుండా ఈ ఫోన్‌కు IP64 వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ ఉంది.

CMF ఫోన్ 1 విషయానికొస్తే దీని వెనుక ప్యానెల్‌ను తీసేయొచ్చు. ఇది రెగ్యులర్, వేగన్ లెదర్ ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఈ గ్యాడ్జెట్ 8-9 మిమీ మందంతో 197-202 గ్రాముల బరువుతో ఉంటుంది. దీనికి IP52 డస్ట్, స్ప్లాష్ ప్రొటెక్షన్ ఉంది. CMF ఫోన్ 1 తేలికగా, సన్నగా ఉన్నప్పటికీ వివో T4x 5G MIL-STD సర్టిఫికేషన్ కారణంగా ఎక్కువ సేఫ్టీని అందిస్తుంది.

ఇది కూడా చదవండి మీకు మొబైల్ గేమ్స్ అంటే ఇష్టమా? iQOO నుంచి సూపర్ గేమింగ్ మొబైల్ వచ్చేస్తోంది

వివో T4x వర్సెస్ ఫోన్ 1: ప్రాసెసర్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ఉంది. వివో T4x 5Gలో LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్ ఉండటం వల్ల ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 8GB వరకు ఎక్స్‌టెండెడ్ RAMను సపోర్ట్ చేస్తుంది.

CMF ఫోన్ 1లో కూడా ఇదే చిప్‌సెట్ ఉంది. అంతేకాకుండా ఇందులో UFS 2.2 స్టోరేజ్ ఉంది.

వివో T4x వర్సెస్ ఫోన్ 1: కెమెరా

వివో T4x 5Gలో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

CMF ఫోన్ 1లో 50MP సోనీ మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ కెమెరాతో కూడిన కెమెరా సెటప్ ఉంది. దీని ఫ్రంట్ కెమెరా 16MP. ఈ రెండు డివైజ్‌లు వెనుకవైపు 4K వీడియో రికార్డింగ్‌ను, ముందువైపు 1080p రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఇది కూడా చదవండి  ఏంటీ.. AI ఫీచర్లు కలిగిన 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.14 వేలేనా?

వివో T4x వర్సెస్ ఫోన్ 1: బ్యాటరీ

వివో T4x 5Gలో 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫ్లాష్‌ఛార్జ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా 40 నిమిషాల్లో 1% నుంచి 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనికి ఐదేళ్ల బ్యాటరీ హెల్త్ గ్యారెంటీ కూడా ఉంది.

CMF ఫోన్ 1లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 20 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది.

PREV
click me!

Recommended Stories

Mobile Price: మొబైల్ ధరల్లో భారీ తగ్గింపు, కొనేందుకు కొన్ని రోజులు ఆగండి
సింగిల్స్ కి నిర్మలమ్మ ఇచ్చిన పెద్ద వరం ఏంటో తెలుసా?