
ప్రపంచ వార్తలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది కదా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం, వివిధ దేశాల్లో సరిహద్దు సమస్యలు.. ఇలా ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. దీనివల్ల చాలా మందికి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం పట్టుకుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళనను కలిగిస్తోంది.
ప్రపంచంలో అనేక దేశాల్లో మూడో ప్రపంచ యుద్ధం గురించి భయం నెలకొంది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచంలో ఏ ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? యుద్ధంలో వేసే అణుబాంబుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలో కొరత ఏర్పడుతుంది. రేడియేషన్ ద్వారా భారీ విధ్వంసం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనా కొన్ని దేశాలు, ప్రదేశాలకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆంగ్లేసీ అనేది వాయువ్య వేల్స్ తీరంలో ఉన్న ఒక ద్వీపం. ఇది మెనాయ్ జలసంధి ద్వారా ప్రధాన భూభాగం నుండి సెపరేట్ అయ్యింది. ఈ ద్వీపం అందమైన బీచ్‌లు, విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉంది. ఆంగ్లేసీ చాలా తక్కువ జనాభాను కలిగి ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఇక్కడ అణు బాంబులు పడే అవకాశాలు చాలా తక్కువ.
కార్న్‌వాల్ అనేది ఇంగ్లాండ్ కు నైరుతి వైపు ఉన్న ఓ గ్రామీణ ప్రాంతం. దాని తీరం వెంబడి నిటారుగా ఉండే రాళ్ళు ఉంటాయి. దక్షిణాన ఫాల్, ఫోవే నదుల ముఖద్వారాలు ఉన్నాయి. ఇక్కడ అణుబాంబులు ప్రవేశించడం అసాధ్యమని చాలా మంది అంటున్నారు.
ప్రపంచంలోనే ఆర్కిటిక్, అంటార్కిటికా ఖండాలు అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు. ఇవి పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా అణు దాడి నుండి తప్పించుకున్న వేలాది మందికి ఇవి ఆశ్రయం ఇవ్వగలుగుతాయి. ఆర్కిటిక్, అంటార్కిటికా కాకుండా పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశాలు, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు, ఆఫ్రికా కూడా మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో సురక్షితమైన ఆశ్రయాలుగా ఉంటాయని అంచనా.
ప్రపంచంలో సురక్షితమైన దేశాలుగా పేరుపొందినవి స్విట్జర్లాండ్, సింగపూర్. ఈ దేశాల్లో ఉండే విస్తారమైన పర్వత ప్రాంతాలు అణు ఆయుధ దాడి నుండి కూడా రక్షణ కల్పించగలవు.
ఇది కూడా చదవండి AIలో కళ్లు చెదిరిపోయే ఫీచర్, ఇకపై లైవ్ వీడియోలు చూపించి AIని ప్రశ్నలు అడగచ్చు
దక్షిణ అమెరికాలోని చిలీ, ఉరుగ్వే, అర్జెంటీనా వంటి దేశాలకు కూడా మూడో ప్రపంచ యుద్ధం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ దేశాలు ప్రధాన ఆహార ఎగుమతిదారులు కాబట్టి యుద్ధం వల్ల ఇక్కడ ఆహార కొరత ఏర్పడే అవకాశం లేదు. అంతేకాకుండా ఫిజీ దీవులు, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, న్యూజిలాండ్, భూటాన్, ఐర్లాండ్ దేశాలు కూడా ప్రపంచంలో సురక్షితమైన ప్రాంతాలు ఉన్నాయి.
ఇండియా ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది. ఇది మన దేశ ఎజెండా. అయితే ఇండియాపై దాడి చేయడానికి ఎవరొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అణ్వాయుధాల శక్తిని కలిగి ఉంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో టాప్. టెక్నాలజీలో స్పీడ్. ఇతర దేశాలతో వాణిజ్యపరంగా ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు దక్షిణ భారత దేశం అంతా ద్వీపంగా ఉంటుంది కనుక మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని కచ్చితంగా చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి వైద్య రంగంలో అద్భుతం, పేషెంట్లకు, డాక్టర్లకు నర్సులా సేవలందించేందుకు AI టూల్ రెడీ