బ్యాంకుల్లో కుంభకోణాలు జరగకుండా రిజర్వ్ బ్యాంక్ చర్యలు...

By Sandra Ashok KumarFirst Published Jan 7, 2020, 12:27 PM IST
Highlights

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లుంది ప్రస్తుత ఆర్బీఐ పరిస్ధితి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహరాష్ట్ర కోఆపరేటీవ్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు పునరావృతం కాకుండా ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.
 

దేశంలో ఉన్న పలు బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వారానికొకసారి ఏదో ఒక బ్యాంక్ లో కుంభకోణం జరిగినట్లు వస్తున్న వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ  ప్రభుత్వాలు బ్యాంకులు నిర్వహించే ప్రభుత్వం, బ్యాంకుల నియామక సంస్థ ఆర్బీఐకి, కేంద్రం సైతం ఎలాంటి చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. అందుకు బ్యాంకింగ్ రంగంలో లూపోల్సే అని చెప్పుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా రుణాన్ని ఎగ్గొట్టి తిరుగుతున్న  నీరవ్ మోడీ లాంటి ఆర్ధిక నేరస్తులకు ఎకానామికల్లీ వీకర్ సిస్టమ్ (ఈడబ్ల్యూఎస్) అండగా ఉంటుంది.

 " ఉదాహరణకు నీరవ్ మోడీ ఓ బ్యాంకులో వేలకోట్లు రుణం తీసుకొని, కట్టకుండా ఆర్బీఐ నుంచి తప్పించుకోవాలంటే..ఈడబ్ల్యూఎస్ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. నీరవ్ మోడీ రేపోమాపో ఆార్బీఐ నీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నువ్వు ఆర్బీఐ నుంచి ఈ విధంగా తప్పించుకోవచ్చు " అని అప్రమత్తం చేస్తుంది.

also read బంగారం ధరలు భయపెడుతున్నాయి....రికార్డు స్థాయికి పది గ్రాముల పసిడి ధర

ఈ వ్యవస్థతోనే ముంబైలోని బ్రాడీహౌస్ లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నీరవ్ మోడీ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ద్వారా 11వేలకోట్లకుపైగా స్కాం చేసి విదేశాలకు చెక్కేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నీరవ్ మోడీ కోసం ప్రపంచ దేశాల పోలీసులు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు.

అయితే బ్యాంకింగ్ రంగంలో జరిగిన స్కాంల గురించి గతేడాది నవంబర్ లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. బ్యాంక్ లో జరుగుతున్న కుంభకోణాల్ని అరికట్టాలంటే ఫ్రేమ్ వర్క్ ను  సవరించాలనే  అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన ఆరునెలల కాలంలో బ్యాంకుల్లో  95,650కోట్ల రూపాయల మోసం జరిగినట్లు తెలిపారు.

ఇక ఆర్బీఐ తెలిపిన వివరాల ఆధారంగా 2013-14 తరువాత  బ్యాంకుల్లో ఆర్ధిక నేరాలు ఐదు శాతం పెరిగినట్లు తెలిపింది.2017-18లో 5,916కేసులు నమోదయ్యాయి. వీటిలో 41,167.04కోట్ల నష్టం వాటిల్లింది.2018-19లో 6,801కేసులు నమోదు కాగా..71,543.93కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బ్యాంకింగ్ రంగంలో జరిగిన కుంభకోణాల వల్లే దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తినట్లు ఆర్ధికవేత్తలు చెబుతున్నారు.  
 
పార్లమెంట్ లో చర్చకు వచ్చిన   ఫ్రేమ్ వర్క్ సవరణపై  ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.  గతనెల డిసెంబర్ లో కో-ఆపరేటీవ్ బ్యాంకులకు ఇచ్చే రుణాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. కో-ఆపరేటీవ్ బ్యాంకుల్లో రుణదాతలకు 10శాతం నుంచి 25శాతం వరకు రుణం ఇచ్చే వెసలు బాటు ఉంది.  

తాజాగా బ్యాంకుల్లో జరుగుతున్న భారీ కుంభకోణాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. పట్టణ సహకార బ్యాంకుల్లో (యూఎస్ బీ) జరుగుతున్న కుంభకోణాల్ని అరికట్టేందుకు ఆర్బీఐ పరిధిలో ఉండి సహకార బ్యాంకులను పర్యవేక్షించే  రివైజ్డ్ సూపర్ వైజరీ ఫ్రేమ్ వర్క్ (sap)ను సవరిస్తూ తుది మార్గదర్శకాలను విడుదల చేసింది.

also read ఆర్థిక సంవత్సరానికి తగ్గనున్నEPFO వడ్డీరేటు!

 డిసెంబర్ 31 న అర్భన్ కో ఆపరేటీవ్ బ్యాంక్ ల్లో  బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బోమ్) ఏర్పాటుకు తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం, రూ .100 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ డిపాజిట్లతో ఉన్న పట్టణ సహకార బ్యాంకుల్లో బోర్డ్ ఆఫ్ మేనేజేమెంట్ ఏర్పాటు చేస్తారు. బోర్డ్  నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ (ఎన్‌పీఏ)ల రికవరీ చేయడం, వన్ టైమ్ సెటిల్మెంట్ చేయడంలో విధులు నిర్వహిస్తుంది.  

ఈ సవరణతో  పట్టణ సహకార బ్యాంకుల్లో నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ 6 శాతం దాటితే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు సెంట్రల్ బ్యాంకులు సైతం బోర్డ్ అప్రూవ్డ్ యాక్షన్ ప్లాన్ ను పట్టణ సహకార బ్యాంకులను అడగవచ్చు. బోర్డ్ అప్రూవ్డ్ యాక్షన్ ప్లాన్ లో పరిమితి దాటితే  అధిక సంఖ్యలో డిఫాల్ట్‌లను కలిగి ఉన్న రంగాలకు రుణాల్ని  తగ్గించడం లేదా, రుణ సదుపాయాల పునరుద్ధరించేలా  ఆర్‌బిఐ ఆదేశిస్తుంది.

ముందస్తు అనుమతి లేకుండా డివిడెండ్ ప్రకటించడం లేదా చెల్లించడంపై ఆర్‌బిఐ ఆంక్షలు విధించవచ్చు.పట్టణ సహకార బ్యాంక్ (యూఎస్ బీ)ల యొక్క  నాన్ ప్రాఫిట్ అసెట్స్ (ఎన్ పీఏ) 6% దాటిన తరువాత  తాజా రుణాలు, అడ్వాన్సులపై నియంత్రిస్తుంది ఆర్బిఐ చర్యలు తీసుకుంది.  

click me!