ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. అంచనాలను అనుగుణంగానే వడ్డీరేట్లు.. జీడీపీని 9.5శాతంగా అంచనా

By asianet news teluguFirst Published Jun 4, 2021, 12:35 PM IST
Highlights

 రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో  కీలక నిర్ణయం తీసుకుంది.  విస్తృత అంచనాలను అనుగుణంగానే ఆర్‌బి‌ఐ  కీలక వడ్డీరేట్లు యథాయథంగానే ఉంది.

జూన్ 2న ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం నేడు ముగిసింది. ఆర్‌బి‌ఐ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశం నిర్వహించి కమిటీ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో విధించిన కఠినమైన ఆంక్షలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయి.

ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ ప్రతి రెండు నెలలకోసారి సమావేశమవుతుంది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుదలపై చర్చించడంతో పాటు వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా పాలసీ రేట్లను 22 మే 2020న సవరించింది.

ప్రత్యేక లక్షణాలు:
1. ఆర్‌బిఐ ఎప్పటిలాగానే రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఎంపిసి ఈ నిర్ణయాన్ని   ఏకగ్రీవంగా తీసుకుంది. అంటే, వినియోగదారులకు ఇఎంఐ లేదా రుణ వడ్డీ రేట్లపై కొత్త ఉపశమనం లభించలేదు.

2. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు కూడా 4.25 శాతంగా ఉంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, పాలసీ రేటును మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ఎంపిసి నిర్ణయించింది. అలాగే ఈసారి ద్రవ్య విధాన సమీక్ష ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టింది.

3. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. దీనితో పాటు బ్యాంకు రేటులో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించారు. ఇది 4.25 శాతంగా ఉంది. ఇంకా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య వైఖరిని 'మితంగా' ఉంచింది.

4. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపిలో 9.5 శాతం వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. గత సమావేశంలో జిడిపి వృద్ధి 10.5 శాతంగా అంచనా వేయబడింది.

also read 

5. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 18.5 శాతం, రెండవ త్రైమాసికంలో 7.9 శాతం, మూడవ త్రైమాసికంలో 7.2 శాతం, నాల్గవ త్రైమాసికంలో 6.6 శాతం ఉంటుంది.

6. ద్రవ్యోల్బణం  2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ 5.1 శాతంగా ఉంటుందని దాస్ చెప్పారు. గత సమావేశంలో కూడా 5.1 శాతంగా అంచనా వేయబడింది. 

7. మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.20 శాతం, రెండవ త్రైమాసికంలో 5.4 శాతం, మూడవ త్రైమాసికంలో 4.7, నాల్గవ త్రైమాసికంలో 5.3 శాతం ఉండవచ్చు.

8. టీకాలు వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం లభిస్తుందని శక్తికాంత దాస్ అన్నారు.  

ఈసందర్భంగా జీ-సాప్ ‌2.0 ను శక్తికాంత దాస్‌ ప్రకటించారు. జూన్ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నరు.  ఫారిన్ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని  శక్తికాంతదాస్ చెప్పారు. 

click me!