చిన్న పొదుపు ​​వడ్డీ రేటు తగ్గింపుపై ​​ఉపశమనం.. 24 గంటల్లోనే నిర్మలా యుటర్న్..

Ashok Kumar   | Asianet News
Published : Apr 01, 2021, 12:16 PM ISTUpdated : Apr 01, 2021, 12:25 PM IST
చిన్న పొదుపు ​​వడ్డీ రేటు తగ్గింపుపై ​​ఉపశమనం..  24 గంటల్లోనే నిర్మలా యుటర్న్..

సారాంశం

నిన్న సాయంత్రం  అంటే ఆర్థిక సంవత్సరం చివరి రోజున మధ్యతరగతి డిపాజిటర్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

న్యూ ఢీల్లీ: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సి), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్‌)తో సహా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై డిపాజిటర్లకు భారీ  ఆర్థిక మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. పిపిఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి, ఎన్‌ఎస్‌సి 6.8 శాతం నుండి 5.9 శాతనికి తగ్గిస్తు బుధవరం నిర్ణయం తీసుకుంది.

పిపిఎఫ్ పై ఈ కొత్త వడ్డీ రేటు 1974 నుంచి ఇదే అత్యల్పం. కొన్ని నివేదికల ప్రకారం పిపిఎఫ్ వడ్డీ రేటు ఆగస్టు 1974 నుండి మార్చి 1975 మధ్య 7 శాతంగా ఉంది. దీనికి ముందు పిపిఎఫ్ వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది. చిన్న పొదుపు పథకాలపై  వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో ప్రకటించబడతాయి. ఇవి బ్యాంకుల ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి.  

 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును తగ్గించే నిర్ణయాన్ని కొద్ది గంటల్లోనే  కేంద్ర ప్రభుత్వం తిరిగి ఉపసంహరించుకుంది. మొదట వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగ ఈ నిర్ణయం తీసుకున్న  24 గంటల్లోనే  ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులను తిరిగి ఉపసంహరించుకుంది.

వడ్డీ రేటును తగ్గించే ఉత్తర్వు పొరపాటున జారీ చేయబడిందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. గత ఏడాది మార్చి త్రైమాసికంలో ఉన్నట్లుగానే అన్ని పథకాలపై వడ్డీ రేటు కొనసాగుతుందని  ఆర్థిక మంత్రి చెప్పారు. చిన్న పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లు యధావిధిగా కొనసాగుతాయి. అలాగే సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి మీరు ఏటా 4 శాతం వడ్డీని పొందడం జరుగుతుంది.

 

PREV
click me!

Recommended Stories

Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్