బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై ఐటీ శాఖ దర్యాప్తు....

By Sandra Ashok KumarFirst Published Jan 21, 2020, 12:46 PM IST
Highlights

నల్లధనం వెలికతీత, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే లక్ష్యంతో 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించారు. కానీ ఈ ఏడాది రెండు నెలల్లో రూ.కోట్లలో బంగారం ఆభరణాల వ్యాపారులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై ఐటీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. 
 

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన తర్వాత బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసిన పసిడి ఆభరణాల వ్యాపారుల ఆర్థిక లావాదేవీలపై ఆర్థిక మంత్రిత్వశాఖ నిశిత పరిశీలన మొదలు పెట్టింది.

నాటి గణాంకాలను ‘డేటా అనలిటిక్స్’తో విశ్లేషించినప్పుడు సదరు వ్యాపారుల ఆదాయానికి, వారు చేసిన బ్యాంక్ డిపాజిట్లకు పొంతన లేదని నిర్ధారించారు. పైగా సదరు వ్యాపారులు 2017-18 ఆర్థిక సంవత్సరం మదింపు ఆదాయం పన్ను రిటర్న్‌ల్లో ఆ డిపాజిట్ చేసిన భారీ మొత్తాల వివరాలను చూపలేదని సమాచారం. అందువల్లే ఆయా లావాదేవీలపై ఆర్థికశాఖ విచారణకు ఆదేశించింది. 

also read రోజురోజుకు పడిపోతున్న దేశ ఆర్థికా వృద్ధిరేటు...కారణం.. ?

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత అత్యంత అధిక మొత్తాల్లో డిపాజిట్ చేసిన కొందరు ఆభరణాల విక్రేతల కేసులను ఆదాయం పన్ను విభాగం స్క్రూటినీ చేసింది. ఆ ఏడాది పూచీకత్తు లేని రుణాలు భారీగా పెరుగడంతోపాటు రుణాల రద్దు కూడా భారీ స్థాయిలోనే జరిగిందని ఆదాయం పన్ను శాఖ గుర్తించింది. 

ఆభరణాల విక్రయంతో వచ్చిన మొత్తం నగదు డిపాజిట్ చేశామని వ్యాపారులు పేర్కొందామని భావించినా, అంతకుముందు ఏడాది 2016 నవంబర్ తొమ్మిదో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జమ చేసిన మొత్తాల్లో అత్యంత భారీగా ఉందని ఆదాయం పన్నుశాఖ అధికారులు గుర్తించారు.

2016 చివరి రెండు నెలల్లో ఒక గుజరాత్ వ్యాపారి రూ.4.14 కోట్లు డిపాజిట్ చేశారు. 2015లో అంతకుముందు కేవలం 44,260 మాత్రమే జమ చేశారు. అంటే 2016లో డిపాజిట్ చేసిన మొత్తం 93.648 శాతంగా తేలింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలుగా చూపిన కొంతమంది ఆభరణాల విక్రేతలు, రెండు మూడు రోజుల్లో కోట్ల రూపాలయు ఎలా డిపాజిట్ చేశారో ఐటీ శాఖ విచారించనున్నది.

ఏడాది సంపాదన కేవలం రూ.1.16 లక్షలని పేర్కొన్న వ్యాపారి మూడు రోజుల్లో రూ.4.14 కోట్లు, రూ.2.66 లక్షలు సంపాదించిన మరొక వ్యాపారి రూ.3.28 కోట్లు, రూ.5.47 లక్షల వార్షికాదాయం గల ఇంకొక వ్యాపారి రూ.2.57 కోట్లు రెండు రోజుల్లోనే జమ చేశారని గుర్తించారు. ఏడాదికి రూ.64,550 సంపాదిస్తున్న వ్యాపారి రూ.72 లక్షలు డిపాజిట్ చేశారు. 

also read Budget 2020: చైనా బొమ్మలంటే ఆలోచించాల్సిందే...ఎందుకంటే...?

మరొక వ్యాపారి రూ.3.23 కోట్ల ఆదాయం ఉన్నదని క్లయిం చేసుకుని ఏకంగా రూ.52.26 కోట్ల నగదు జమ చేశారు. 2015 నవంబర్ తొమ్మిదో తేదీన ఆయన వద్ద రూ.2.64 లక్షల నగదు మాత్రమే ఆయన వద్ద ఉంది. కానీ 2016 నవంబర్ తొమ్మిదో తేదీన రూ.6.22 కోట్లు చూపారు. హ్యాండ్ క్యాష్ రూపంలో 23.490 శాతం అధికంగా ఉన్నది. కానీ దీనిపై ఆయన వివరణ సంతరుప్తికరంగా లేదని ఐటీ అధికారులు అభిప్రాయ పడ్డారు. 

ఆభరణాల కోసం గుర్తు తెలియని కస్టమర్ల నుంచి రూ.20 వేల కంటే తక్కువగా అడ్వాన్సులు తీసుకున్నట్లు చూపి బ్యాంకులో జమ చేశారు. తదుపరి అదే మొత్తం వారికి వాపస్ చేసినట్లు చెప్పారు. ఆడిట్ నివేదికను 3సీబీ పత్రంతో కలిపి అప్ లోడ్ చేసినప్పుడు, తమ సొంత సంస్థ లాభాలు, నష్టాలు కాక వేరే సంస్థవిగా నమోదు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. 
 

click me!