గ్యాస్ సిలిండర్ డెలివరీకి డి‌ఏ‌సి కోడ్ తప్పనిసరి కాదు.. వంట సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది..

By Sandra Ashok KumarFirst Published Nov 2, 2020, 5:07 PM IST
Highlights

వంట గ్యాస్ వినియోగదారులు మొబైల్ నంబరును గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానించకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పటికే దేశంలో 30 శాతం మంది గ్యాస్ వినియోగదారులు డిఎసిని ఉపయోగిస్తున్నారు.

చమురు కంపెనీలు  నవంబర్ 1, 2020 నుండి దేశంలో వంట గ్యాస్ సిలిండర్లకు (ఎల్‌పిజి) డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డిఎసి) అమలును వాయిదా వేసింది. వంట గ్యాస్ వినియోగదారులు మొబైల్ నంబరును గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానించకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అయితే, ఇప్పటికే దేశంలో 30 శాతం మంది గ్యాస్ వినియోగదారులు డిఎసిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చమురు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ డిఎసి కొనసాగుతుందని, అయితే ఇది ప్రస్తుతం తప్పనిసరి కాదని అన్నారు.

కస్టమర్ మొబైల్ నంబర్ గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానించకపోతే, అప్పుడు డిఎసి కోడ్ అతని మొబైల్‌ నంబరుకు రాదు. సాంకేతికల దృష్ట్యా, ప్రస్తుతానికి ఇది తప్పనిసరి చేయలేదు. చమురు కంపెనీలు ఢీల్లీ-ఎన్‌సిఆర్, 100 స్మార్ట్ సిటీలలో సిలిండర్ల డెలివరీ కోసం నవంబర్ 1 నుండి డిఎసి కోడ్‌లను తెలపడం తప్పనిసరి చేసింది.  

డిఎసి కోడ్ అంటే ఏమిటి?  
డిఎసి ద్వారా గ్యాస్ బుకింగ్ చేయడం వల్ల మీరు సిలిండర్ల డెలివరీ పొందుతారు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక కోడ్ పంపబడుతుంది, మీరు ఆ కోడ్‌ను గ్యాస్ డెలివరీ బాయ్‌కు తెలపాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే వినియోగదారులకు ఎల్‌పిజి సిలిండర్ డెలివరీ పొందుతారు.

also read 

ఒకవేళ కస్టమర్లు మొబైల్ నంబరును రిజిస్టర్ చేసుకోకపోతే, వారు వారి మొబైల్ నంబరును యాప్ ద్వారా కూడా అనుసంధానించవచ్చు. ఈ యాప్ డెలివరీ బాయ్‌ దగ్గర అందుబాటులో ఉంటుంది. మొబైల్ నంబర్ అప్ డేట్ తర్వాత డిఎసి కోడ్ ఉత్పత్తి అవుతుంది.

మొబైల్ నంబర్‌ను అనుసంధానించని వారికి గ్యాస్ డెలివరిలో కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కొత్త నిబంధనలతో చిరునామా, మొబైల్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసిన వినియోగదారులు సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం కారణంగా వారి గ్యాస్ డెలివరీని వేరేవాళ్ళకు జరగకుండా అపవచ్చు.

ఈ నిబంధనలు వాణిజ్య సిలిండర్లకు వర్తించదు. దీని వల్ల  నకిలీ గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ డెలివరీ జరగకుండా చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ల అక్రమ డెలివరీ, వినియోగం నివారించడానికి, అసలైన గ్యాస్ కనెక్షన్ కస్టమర్లను గుర్తించడానికి, కంపెనీలు డెలివరీ అతేంటికేషన్ కోడ్ సిస్టంను తప్పనిసరి చేశాయి. 

గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వ సబ్సిడీ
 ప్రస్తుతం ప్రతి సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లకు ప్రభుత్వం సంవత్సరానికి సబ్సిడీ ఇస్తుంది. వినియోగదారులు దీని కంటే ఎక్కువ సిలిండర్లు తీసుకోవాలనుకుంటే, వారు వాటిని మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. వీటి ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లు, విదేశీ మారక రేట్ల మార్పు వంటి అంశాలతో నిర్ణయిస్తారు.

 

click me!