విద్యుత్ వాహనాలపై పన్నొద్దు.. కానీ ఆర్టీసీ బస్సులపై ..?

By narsimha lodeFirst Published Jan 13, 2019, 10:57 AM IST
Highlights

విద్యుత్ వాహనాలపై రహదారి పన్ను విధించకూడదని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ కాంత్ సూచించారు.

న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలపై రహదారి పన్ను విధించకూడదని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ కాంత్ సూచించారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి వినియోగంలోకి తీసుకొస్తున్న విద్యుత్ వాహనాలపై రహదారి పన్ను విధించకుండా ‘గ్రీన్ పర్మిట్’ జారీ చేయాలని సూచించారు. దీనికి బదులు వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ బస్సు సర్వీసులపై ‘కిలోమీటర్ ప్రాతిపదికన’ పన్ను విధిస్తే బెటర్‌గా ఉంటుందన్నారు. 

విద్యుత్ వాహనాలపై రహదారి పన్ను విధించరాదన్న ప్రతిపాదనను వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల ముందు ప్రతిపాదించినట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. కంబుస్టన్‌తో కూడిన విద్యుత్ వాహనాలపై భారతదేశంపై విద్యుత్ వాహనాల విప్లవం ప్రభావం భారీగానే ఉంటుందన్నారు. 

శిలాజ ఇంధనం (పెట్రోల్) వినియోగం నుంచి భారత్ విద్యుత్ వాహనాల వినియోగంపై విజయవంతంగా ముందుకు సాగుతుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మున్ముందు పెట్రోలియం సంస్థలు విద్యుత్ చార్జింగ్ సంస్థల అవతారం ఎత్తుతాయని అమితాబ్ కాంత్ తెలిపారు.

ఆటోమొబైల్ రంగంలో పురోగతి సాధించడానికి విద్యుత్ నిల్వ, బ్యాటరీల ఉత్పాదక పరిశ్రమల పెరిగేందుకు దోహదపడుతుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ఆ రెండు విభాగాల పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 

విద్యుత్ వాహనాల వినియోగం, అమలుపై సందేహాలు తలెత్తుతాయని నీతి ఆయోగ్ డైరెక్టర్ జనరల్ అనిల్ శ్రీవాత్సవ అన్నారు. కానీ పెట్రోల్ వాహనాల నుంచి విద్యుత్ వాహనాల దిశగా స్వేచ్ఛగా దారి మళ్లుతుందని నీతి ఆయోగ్ డైరెక్టర్ జనరల్ అనిల్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. 

ఒక్క పేజ్‌లో ద్విచక్ర వాహనాలకు మాత్రమే కాక విద్యుత్ వాహనాల వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద 20కి పైగా అనుకూల విధానాలు అందుబాటులో ఉన్నాయని నీతి ఆయోగ్ డైరెక్టర్ జనరల్ అనిల్ శ్రీవాత్సవ తెలిపారు. 

click me!