ట్రెడిషనల్ వెహికల్స్‌పై ‘విద్యుత్ సెస్’ వేస్ట్!: ఆర్సీ భార్గవ

By rajesh yFirst Published Dec 20, 2018, 10:45 AM IST
Highlights


విద్యుత్ వినియోగ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంప్రదాయ కార్ల వినియోగదారులపై ‘విద్యుత్ సెస్’ విధించొద్దని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ ప్రభుత్వానికి సూచించారు. దీనికి బదులు దేశవ్యాప్తంగా సీఎన్జీ పంపిణీ కేంద్రాలు పెంచడంతోపాటు విద్యుత్ వాహనాల వినియోగానికి వెళ్లేముందు హైబ్రీడ్ టెక్నాలజీని ప్రోత్సహించాలన్నారు.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కర్బన రహిత.. విద్యుత్ వినియోగ కార్లను తయారు చేసేందుకు ఆటోమొబైల్ సంస్థలన్నీ అష్టకష్టాల పాలవుతున్నాయి. చౌక ధరకే వినియోగదారులకు విద్యుత్ కార్లను అందించేందుకు ఆ సంస్థలు రకరకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి విద్యుత్ వినియోగ కార్లు, వాహనాల కోసం మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నది. ఈ క్రమంలో మధ్యంతర వ్యూహంగా సీఎన్జీ గ్యాస్, హైబ్రీడ్ టెక్నాలజీతో కూడిన వాహనాల తయారీ, వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ సూచించారు. 

దానికి బదులు  విద్యుత్ వినియోగ కార్లను ప్రోత్సహించేందుకు సంప్రదాయ కార్లపై సెస్ విధించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో ప్రయోజనాలు నెరవేరబోవని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. దానికి బదులు మోటారు సైకిళ్లపై పన్ను విధించాలని సూచించారు. విద్యుత్ వినియోగ ద్విచక్ర వాహనాలను ప్రోత్సహించేందుకు పెట్రోల్ వినియోగ బైక్‌లపై సెస్ విధించాలని సూచించారు. కాలుష్యకారకాలు అన్నప్పుడు మోటారు సైకిళ్లు కూడా కాలుష్యం స్రుష్టిస్తున్నాయని గుర్తు చేశారు. 

‘సబ్సిడీల ప్రాతిపదికన చిన్న కార్ల ఎలక్ట్రిఫికేషన్‌ సాధ్యపడుతుందమని వ్యక్తిగతంగా నేనైతే భావించడం లేదు. ఇందుకోసం టెక్నాలజీ అవసరం అంతే తప్ప. సబ్సిడీలివ్వడమనేది లాభసాటి మార్గమని అనుకోవడం లేదు. సబ్సిడీలతో పెద్ద కార్లున్న సంపన్నులే లాభపడతారు తప్ప.. లక్ష్యం నెరవేరదు’అని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలొక్కటే మార్గం కాదని.. ఇతరత్రా హైబ్రీడ్, బయోఫ్యుయల్స్, సీఎన్‌జీ వాహనాలను కూడా ప్రోత్సహించే అంశం పరిశీలించవచ్చన్నారు.

దేశంలోని మోటారు సైకిళ్ల దేశంలోకెల్లా మూడింట రెండొంతుల పెట్రోల్ వాడుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్నదని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ భార్గవ పేర్కొన్నారు. ఇళ్ల వద్ద ద్విచక్ర వాహనాల విద్యుద్ధీకరణ చాలా తేలిక అని తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద సమస్య చిన్న కార్లేనన్నారు. 70 శాతం చిన్న కార్లను ఇళ్ల వద్ద పార్క్ చేయకపోవడంతో చార్జింగ్ చేయడం కష్టతరంగా మారుతుందన్నారు. 

ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే 2030 తర్వాత ముడి చమురు దిగుమతి తగ్గుదలతోపాటు కాలుష్యాన్ని నివారించేందుకు సీఎన్జీ, హైబ్రీడ్, బయో ఫ్యూయల్ వాడకాన్ని పెంపొందించవచ్చునని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. అందుకు మూడు రకాల టెక్నాలజీలు అవసరం అని తెలిపారు. సీఎన్జీ గ్యాస్ వల్ల వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందన్నారు. దేశీయ ఆటో మేజర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) చౌక విద్యుత్ వాహనాల తయారీకి ప్రయత్నిస్తున్నాయి.  2019 డిసెంబర్ నెలాఖరు నాటికి బీఎస్ 4 ప్రమాణాలతో కూడిన అన్ని వాహానాల తయారీని నిలిపివేస్తామని మారుతి సుజుకి ఎండీ ఆర్సీ భార్గవ తెలిపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి సేల్స్ వ్రుద్ధి అంచనాలను 8 శాతం తగ్గించి వేసింది. ఇంతకుముందు  రెండంకెల అభివ్రుద్ది సాధిస్తామని మారుతి సుజుకి ఇండియా అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, పెరిగిన బీమా వ్యయం, అదిక ఇంధన ధరలతో ఈ ఏడాది ద్వితీయార్థంలో విక్రయాలు తగ్గిపోతాయని అంతా భావిస్తున్నారు. అయితే ఎన్నికల ఏడాదిలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడం సాధారణమేనని, ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

click me!