మూడేళ్లలో రెట్టింపు సేల్స్ నిస్సాన్ లక్ష్యం

By sivanagaprasad kodatiFirst Published Oct 21, 2018, 2:19 PM IST
Highlights

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ 2021 నాటికి తన కార్ల విక్రయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 287 సేల్స్ ఔట్ లెట్లు కలిగి ఉన్న నిస్సాన్ ఇండియా వచ్చే మూడేళ్లలో వాటిని 500 టచ్ పాయింట్లకు చేర్చాలన్న సంక్పలంతో అడుగులేస్తోంది. 

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ 2021 నాటికి తన కార్ల విక్రయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 287 సేల్స్ ఔట్ లెట్లు కలిగి ఉన్న నిస్సాన్ ఇండియా వచ్చే మూడేళ్లలో వాటిని 500 టచ్ పాయింట్లకు చేర్చాలన్న సంక్పలంతో అడుగులేస్తోంది.

ఇటీవల నూతనంగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్‌యూవీ నిస్సాన్ కిక్స్ మోడల్ కారుతోపాటు మొత్తం సేల్స్ మూడేళ్లలో రెట్టింపు చేయాలని భావిస్తున్నదని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు థామస్ కైహ్ల్ తెలిపారు. నిస్సాన్, దస్టన్ బ్రాండ్ షోరూమ్‌ల ద్వారా లక్ష్యాన్ని చేధించాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

నిస్సాన్ ఇండియా ప్రస్తుతం వచ్చే ఏడాది జనవరిలో నూతన మోడల్ కంపాక్ట్ ఎస్ యూసీ కిక్స్ మోడల్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నూతన కిక్స్ ఎస్ యూవీ మోడల్ కారుతో నూతన వ్యూహాన్ని అమలు చేయాలని నిస్సాన్ ఇండియా సిద్ధమైంది.

నిస్సాన్ 2.0 వ్యూహంలో భాగంగా హుండాయ్ క్రెటా, రెనాల్ట్ కాప్చర్ మోడల్ కార్లను విక్రయాల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది నిస్సాన్ కిక్స్. అలాగే తమ నెట్ వర్క్ ను కూడా విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేశామని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు థామస్ కైహ్ల్ చెప్పారు. అయితే దానికి శక్తిమంతమైన బ్రాండ్ అవసరం అని చెప్పారు.

రెండు బ్రాండ్ల మద్దతుతో డీలర్ షిప్ నెట్ వర్క్ ను కూడా డిజిటలైజ్ చేయనున్నట్లు తెలిపారు. అదే జరిగే ప్రత్యర్థి కార్ల తయారీ సంస్థలపై పై చేయి సాధించినట్లేనని పేర్కొన్నారు. అందుకోసం సామూహిక వినియోగానికి దస్టన్, మెయిన్ స్ట్రీమ్ ప్రీమియం నిస్సాన్ బ్రాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 
 

click me!