విటారా బ్రెజ్జా కోసం నో మోర్ వెయిటింగ్: మారుతి సుజుకి

By rajesh yFirst Published Nov 20, 2018, 2:49 PM IST
Highlights

ఇతర ఆటోమొబైల్ సంస్థల నుంచి పెరిగిన పోటీని తట్టుకునేందుకు మారుతి సుజుకి ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. తన ఎస్ యూవీ మోడల్ విటారా బ్రెజా కారు విక్రయాలు పెంచడానికి గల మార్గాలు అన్వేషిస్తోంది. ప్రస్తుతం ఆ కారు కోసం వేచి ఉండే ఆరు వారాల సమయాన్ని తగ్గించేందుకు గుజరాత్ రాష్ట్రంలోని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని పెంచుతోంది. 

న్యూఢిల్లీ: వినియోగదారులను ఆకట్టుకునేందుకు మారుతి సుజుకి ఇండియా కొత్త మంత్రం పాటిస్తోంది. ఆ కారు తయారు చేసిన విటారా బ్రెజ్జా మోడల్ కారు బుక్ చేసుకున్న వారు ఆరు వారాల పాటు వేచి ఉండాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో వారి వెయిటింగ్ టైం తగ్గించే లక్ష్యంతో సదరు ఎస్ యూవీ మోడల్ విటారా బ్రెజ్జా కారు ఉత్పత్తి సామర్థ్యం పెంచినట్లు మారుతి సుజుకి మంగళవారం తెలిపింది. 

గతేడాది ఏప్రిల్ - అక్టోబర్ మధ్య ఉత్పత్తి తో పోలిస్తే 10 శాతం పెంచి 94 వేల కార్లు తయారు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని మారుతి సుజుకి ప్లాంట్ పూర్తి స్థాయిలో కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఏటా 2.5 లక్షల కార్ల ఉత్పత్తి దీని లక్ష్యం. సమీప భవిష్యత్ లో దీని ఉత్పత్తి సామర్థ్యం పెంచగలమని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ తెలిపారు. 

ప్రస్తుతం ఈ మోడల్ కారు కోసం వినియోగదారులు నాలుగు నుంచి ఆరు వారాల పాటు వేచి ఉండాల్సి వస్తున్నది. ఈ సమయాన్ని తగ్గిస్తే తమ కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో విటారా బ్రెజా మోడల్ కార్లు 1.48 లక్షల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల వరకు 95 వేల యూనిట్లు విక్రయించింది. 2016 మార్చిలో మార్కెట్లోకి విటారా బ్రెజాను ఆవిష్కరించినప్పటి నుంచి 3.57 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది మారుతి సుజుకి. 

click me!