వచ్చేనెలలో మహీంద్రా ఎస్‌యూవీ ‘వై-400’

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 11:38 AM IST
Highlights

దేశీయ ఆటోమోబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వచ్చే నెలలో నూతన విలాసవంతమైన ఎస్‌యూవీ మోడల్ కారు మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దానికి వై-400 అనే కోడ్ నేం కూడా పెట్టింది. 

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వచ్చే నెలలో నూతన విలాసవంతమైన ఎస్‌యూవీ మోడల్ కారు మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దానికి వై-400 అనే కోడ్ నేం కూడా పెట్టింది. మహారాష్ట్రలోని చకాన్‌లో గల మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్‌లో ఈ వై-400 మోడల్ కారు ఉత్పత్తి చేస్తున్నది. దీన్ని వచ్చేనెల 19వ తేదీన మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 


ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యున్నత స్థాయితో కూడిన ‘వై-400’ మోడల్ కారు పూర్తిస్థాయి ఎస్ యూవీ మోడల్ కారు. ప్రత్యేకించి వినియోగదారులకు ఇష్టమైన టేస్ట్ ఫుల్ డిజైన్, లావీష్ ఇంటీరియర్లు, థ్రిల్లింగ్ ఫెర్పార్మెన్స్ గల ఫీచర్లు ఇందులో అదనంగా ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ అధ్యక్షుడు రాజన్ వధేరా ఇటీవల చెప్పారు. 

‘ఎస్‌యూవీ పోర్ట్ ఫోలియో సెగ్మెంట్‌లో మేం విస్తరించడానికి ఈ మోడల్ కారు వై-400 వీలు కలిగిస్తుంది’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ అధ్యక్షుడు రాజన్ వధేరా చెప్పారు. ఎస్‌యూవీ డీలర్లందరి వద్ద వై-400 మోడల్ కారు అందుబాటులో ఉంటుందన్నారు. ఆల్ట్రా మోడ్రన్ డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానమై ఉన్న డీలర్లు తమ వినియోగదారులకు స్ఫూర్తిదాయకమైన సేవలను అందించనున్నారని రాజన్ వధేరా తెలిపారు. 
 

click me!