ట్రయంఫ్, హార్లే డేవిడ్సన్‌లకు ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్‌’ సవాల్.. వచ్చే నెల నుంచి డెలివరీ

By rajesh yFirst Published Jul 30, 2019, 11:45 AM IST
Highlights

ప్రముఖ మోటార్‌సైకిల్స్‌ తయారీ సంస్థ కవాసాకీ మోటార్స్‌ విపణిలోకి సరికొత్త ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్‌ రెట్రో స్టైల్డ్‌’ మోటార్‌ సైకిల్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షలుగా ఉంది. దీని కొనుగోలు కోసం బుకింగ్స్ కూడా మొదలైనట్లుగా ఇండియా కవాసకీ మోటార్స్‌ ప్రకటించింది. 
 

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్‌సైకిల్స్‌ తయారీ సంస్థ కవాసాకీ మోటార్స్‌ విపణిలోకి సరికొత్త ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్‌ రెట్రో స్టైల్డ్‌’ మోటార్‌ సైకిల్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షలుగా ఉంది. దీని కొనుగోలు కోసం బుకింగ్స్ కూడా మొదలైనట్లుగా ఇండియా కవాసకీ మోటార్స్‌ ప్రకటించింది. 

కవాసాకీ విడుదల  చేసిన ‘డబ్ల్యూ 800 స్ట్రీట్’ బైక్‌.. హార్లే డేవిడ్సన్ స్ట్రీడ్ రాడ్, ఇండియన్ స్కౌట్ సిక్స్‌టీ, ట్రయంఫ్ బొన్నెవెల్లీ బైక్ లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. ఈ మోడల్‌ మోటరు సైకిల్‌పై అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో భాగంగా 2015లో భారత్‌లో ప్రదర్శించినా భారత మార్కెట్లోకి రావడానికి ఈ మోడల్‌కి నాలుగేళ్లు పట్టింది.

ఈ మోడల్‌ రెట్రో 773 సీసీ వెర్టికల్‌ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ విత్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌, 4000 ఆర్‌పీఎం వద్ద 62.9 ఎన్‌ఎం టార్క్‌ విడుదల చేస్తుంది. 5వే అడ్జెస్టబుల్‌ క్లచ్‌ లివర్, 4వే అడ్జెస్టబుల్‌ బ్రేక్ లివర్‌, ఎల్‌సీడీ స్క్రీన్ డిస్ల్పే, 41ఎంఎం టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, ఏబీఎస్‌ టెక్నాలజీ ఈ మోడల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 

ముందస్తుగా బుకింగ్స్‌ చేసుకున్న వినియోగదారులకు వచ్చేనెల నెలాఖరు నుంచి వాహనాలను డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఈ మోడల్‌ బైక్‌ను పరిమిత సంఖ్యలో భారత్‌లో విడుదల చేస్తున్నట్లు.. అనుకున్న లక్ష్యాల మేరకు డబ్ల్యూ 800 మోడల్‌ విక్రయాలు జరిగినట్లయితే ఉత్పత్తిని పెంచనున్నట్లు కవాసాకీ మోటార్స్‌ వెల్లడించింది.

click me!