నాలుగు కోట్లు దాటిన హోండా కస్టమర్ బేస్

By rajesh yFirst Published Dec 21, 2018, 2:26 PM IST
Highlights

హోండా మోటార్స్ విక్రయాలు 4 కోట్ల మైలురాయిని దాటాయి. 14 ఏళ్లలో రెండు కోట్లకు చేరుకుంటే.. మిగతా రెండు కోట్ల వాహనదారులు కేవలం నాలుగేళ్లలోనే జత కూడారు.

న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఒక మైలురాయిని చేరుకున్నది. భారతదేశంతోపాటు విదేశాల్లోనూ 18 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఒక మైలురాయిని చేరుకున్నది. గురువారానికి హోండా మోటార్స్ బైక్‌ల విక్రయాలు నాలుగు కోట్లకు చేరుకున్నాయి. వాటిలో తొలి రెండు కోట్ల వినియోగదారులను చేరుకోవడానికి హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియాకు 14 ఏళ్లు పట్టింది. కానీ మరో రెండు కోట్ల బైక్‌ల విక్రయానికి కేవలం నాలుగేళ్లు మాత్రమే పట్టింది. 

తాము మోటార్ బైక్స్, సూటర్లు తయారు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్ఫూర్తిదాయక సవాళ్లను ఎదుర్కొన్నామని హోండా మోటార్ అండ్ స్కూటర్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ మినోరు కాటో ఒక ప్రకటనలో తెలిపారు. వినూత్న అత్యంత నాణ్యతతో కూడిన ఉత్పత్తులతో కోట్ల మంది వినియోగదారులకు చేరువైనందుకు సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. 

హోండా మోటార్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ తమ బైక్‌లు, స్కూటర్లు విస్తృతమైన శ్రేణిని కలిగి ఉన్నాయని, దీనికి తోడు తమ నెట్ వర్క్ శరవేగంగా విస్తరించిందన్నారు. వినియోగదారుల కలలను సాకారం చేస్తున్నందుకు ఆనందంగా ఉన్నదని తెలిపారు.  

click me!