అడ్వెంచర్లు+టూర్లే స్పెషల్: విపణిలోకి అధునాతన హీరో బైక్స్

By telugu teamFirst Published Apr 29, 2019, 3:06 PM IST
Highlights


హీరో మోటో కార్ప్ సంస్థ విపణిలోకి సరికొత్త మోటార్ బైక్‌లను మే 1వ తేదీన ఆవిష్కరించనున్నది. హీరో ఎక్స్ ప్లస్ 200 అడ్వెంచర్లు, ఎక్స్ పల్స్ 200 టీ మోడల్ బైక్ పర్యటనలకు వీలుగా రూపుదిద్దుకున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోడల్ బైక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 ఢీకొట్టనున్నది.

దేశీయ మోటార్స్ సైకిల్స్ దిగ్గజం ‘హీరో మోటో కార్ప్స్’ విపణిలోకి సరికొత్త మోటారు బైక్‌లను బుధవారం ఆవిష్కరించనున్నది. ‘హీరో ఎక్స్ ప్లస్ 200’, ‘హీరో ఎక్స్ పల్స్ 200 టీ (టూరర్) మోడల్ బైక్‌లను మే నెల ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది. గతేడాది ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ఎస్మా మోటార్ సైకిల్ షోలో హీరో మోటో కార్ప్స్ తొలుత ఈ బైక్‌లను ప్రదర్శించింది. ఎక్స్ పల్స్ 200 మోడల్ బైక్ అడ్వెంచర్లు, ఎక్స్ పల్స్ 200 టీ మోడల్ బైక్ టూర్లకు అనుకూలంగా ఉంటుందని హీరో మోటో కార్ప్ పేర్కొంది. 

ఎక్స్ పల్స్ 200, ఎక్స్ పల్స్ 200టీ బైక్స్‌లోనూ గతేడాది హీరో మోటో కార్ప్స్ ఆవిష్కరించిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోడల్ బైక్‌లో వాడిన ఇంజిన్‌నే వినియోగిస్తున్నారు. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోడల్ బైక్‌లో వాడిన ఇంజిన్ 199.6సీసీ, ఎయిర్ కూల్డ్, 4- స్ట్రోక్, 2- వాల్వ్‌తోపాటు  18.3 హెచ్పీ, 17.1 ఎన్ఎం ఆఫ్ టార్చి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్‌లో 5- స్పీడ్ కాంస్టంట్ మెష్ గేర్ బాక్స్ అమర్చారు. 

హీరో ఎక్స్ పల్స్ 200 బైక్‌కు ‘నాబీ టైర్లు’, 825 ఎంఎం ఎత్తుపై సీటు అమర్చారు. ఎక్స్ పల్స్ 200 బైక్‌లో 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రేర్ వీల్స్ కలిగి ఉంటుంది. హీరో ఎక్స్ పల్స్ 200టీ బైక్ లోనూ వీల్స్, సీటింగ్ అమర్చారు. హీరో ఎక్స్ పల్స్ 200టీ సేఫ్టీ అండ్ కన్వీయన్స్ ఫీచర్లు కలిగి ఉంటుంది. సింగిల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ హెడ్ అండ్ టెయిల్ లాంప్స్, డిజిటల్ స్పీడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ తదితర ఫీచర్లు అమర్చింది హీరో మోటో కార్ప్స్. 

హీరో ఎక్స్ పల్స్ 200 బైక్, హీరో ఎక్స్ పల్స్ 200 టీ మోడల్ బైక్‌లు రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షలు పలుకుతాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ మోడల్ బైక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 మోడల్ బైక్ ఢీ కొంటుంది.

click me!