ఇళ్లలోనూ విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు మస్ట్

By Arun Kumar PFirst Published Oct 25, 2018, 3:59 PM IST
Highlights

ప్రతి ఇంటిలోనూ, వాణిజ్య భవనాల్లోనూ, పార్కింగ్ ప్రదేశాల్లోనూ విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి కానున్నది. ఇందుకోసం చట్టంలో సవరణలు తేవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

న్యూఢిల్లీ: యావత్ ప్రపంచ దేశాలతోపాటు భారతదేశం కూడా కాలుష్య నియంత్రణ దిశగా ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులతో ప్రత్యేకించి విద్యుత్ వినియోగంతో నడిచే కార్లు, మోటార్ సైకిళ్ల దిశగా యావత్ ప్రపంచం పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ చార్జింగ్ ప్రధాన ప్రతిబంధకంగా మారనున్నది. దీంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా కొన్ని సవరణలు ప్రతిపాదిస్తోంది. భవన నిర్మాణ చట్టాల్లో వాటిని చేర్చనున్నది. ప్రతి ఇంటిలోనూ, వాణిజ్య భవనాల సముదాయాల్లోనూ, పార్కింగ్ ప్రదేశాల్లోనూ ‘విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు’ ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ చట్టాలను సవరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 

24 గంటల పాటు ఇండ్ల వద్ద విద్యుత్ వాహనాలకు చార్జింగ్ మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత చట్ట సవరణలో చేర్చనున్నది. అన్ని వాహనాలకు వాణిజ్య భవన సముదాయాల్లోనూ 20 శాతం చార్జింగ్ బేలు ఏర్పాటు చేయాలని సూచించనున్నది. 

హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ పరిధిలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్ ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పించేందుకు భవన నిర్మాణాల చట్టాలు, మాస్టర్ ప్లాన్ రెగ్యులేషన్స్ లో సవరణలు ప్రతిపాదిస్తోంది. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు, బస్ టర్మినట్లు, సర్వీస్ స్టేషన్లు, సంస్థాగత భవనాల్లోనూ ఈ వాహన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు నిర్మాణానికి చకచకా ముసాయిదా రూపొందిస్తోంది. 2030 నాటికి అన్ని ఇళ్లలో మూడోవంతు విద్యుత్ చార్జింగ్ వసతులు కల్పించాలన్నది కేంద్రం ప్రతిపాదన. 

సంప్రదాయ వాహనాలతో పోలిస్తే విద్యుత్ వినియోగ మోటారు బైక్‌లతో కాలుష్య రహితంగా ఉంటుందని, ఆర్థికంగానూ వెసులుబాటు లభిస్తుందని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సోహిందర్ గిల్ చెప్పారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం అయితే సరిపడా ఆర్థిక ఇబ్బందులతోపాటు వినియోగదారుల్లో అవగాహన కలిగించడం, విద్యుత్ చార్జింగ్ వసతుల కల్పన వంటి అంశాలపై తక్షణం ద్రుష్టి సారించాల్సి ఉన్నదని తెలిపారు. 

ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ విద్యుత్ అండ్ ఫ్యూయల్స్ డివిజన్ ఏరియా కన్వీనర్ అలేఖ్య దత్తా మాట్లాడుతూ 25 శాతం వాహనాల బేస్ బ్యాటరీల ఆధారితంగా మారాలంటే 20.7 టెరావాట్ల విద్యుత్ అవసరం. దానికి రూ.7000 కోట్ల మూలధనం కావాల్సి ఉంటుందన్నారు. దీనికి తోడు 40 లక్షలకు పైగా జనాభా గల తొమ్మిది కాలుష్య కారక నగరాల పరిధిలో ఎకో సిస్టమ్స్ అభివ్రుద్ధి చేయాల్సి ఉంటుందని తెలిపారు.

click me!