విత్ బీఎస్-6 ఎఫెక్ట్ బెంజ్‌ ‘ఈ-క్లాస్‌’: ధర రూ.57.5 లక్షల నుంచి మొదలు

By rajesh yFirst Published May 21, 2019, 10:59 AM IST
Highlights

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక ఏడాది ముందే కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులేసిన బెంజ్.. ‘ఈ-క్లాస్’ మోడల్ పేరిట కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.57.5 లక్షల నుంచి మొదలవుతుంది.

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ఏడాది ముందే బీఎస్‌-6 నిబంధనల అమలు దిశగా అడుగులేసింది. కర్బన ఉద్గారాల నియంత్రణకు నిర్దేశించి బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా సెడాన్‌ మోడల్‌ ఈ-క్లాస్‌ మోడల్ కారును సోమవారం భారత విపణిలోకి విడుదల చేసింది. 

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారు ధర రూ.57.5- 62.5 లక్షలుగా నిర్ణయించారు. పొడవైన చక్రాలు కలిగిన కొత్త ఈ-క్లాస్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో లభించనుంది. ఇందులో అత్యాధునిక ఇంటీరియర్‌ ఫీచర్లను చేర్చామని కంపెనీ తెలిపింది. 

పెట్రోల్‌ వెర్షన్‌లో అమర్చిన 1991 సీసీ ఇంజిన్‌ 197 హార్స్‌పవర్‌ శక్తి అందిస్తుంది. పెట్రోల్‌ వేరియంట్ ఈ 200 మోడల్ కార్ల ధరలు వరుసగా రూ.57.5 లక్షలు, రూ.61.5 లక్షలకు లభిస్తాయి. 

ఇక డీజిల్‌ వెర్షన్‌లో అమర్చిన 1950 సీసీ ఇంజిన్‌ 194 హార్స్‌పవర్‌ శక్తి అందిస్తుంది. డీజిల్ వెర్షన్ ఈ-క్లాస్ ఈ220డీ కార్ల ధరలు రూ.58.5 లక్షలు, రూ.62.5 లక్షలు పలుకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వర్షన్ కార్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉన్నాయి. 

భారత్‌లో గతేడాది జనవరిలో తొలి బీఎస్‌-6 వాహనాన్ని విడుదల చేశామని, నెమ్మదిగా పోర్ట్‌ఫోలియోను బీఎస్‌-6కు అనుగుణంగా మారుస్తున్నామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఎండీ, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి కొత్త ఉద్గార నిబంధనలు అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 

కొత్త కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్‌ పైలట్‌, యాక్టివ్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, అడాప్టివ్‌ బ్రేక్‌ లైట్లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ-350 మోడల్ కారులో మాదిరిగా 13- స్పీకర్ బర్ మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ చార్జర్లు ఉన్నాయి. నాన్ ఏఎంజీ మోడల్స్‌లో మెర్సిడెస్ కమాండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. 

click me!