బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ దెబ్బ: మూడేళ్లలో ‘ఆటో’కు గడ్డుకాలమే!!

By rajesh yFirst Published Dec 24, 2018, 2:15 PM IST
Highlights

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ.. అంతర్జాతీయంగా ఐటీతోపాటు బిజినెస్ రంగంలో సంచలనం నెలకొల్పిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆటోమొబైల్ రంగానికి కష్టకాలం తెచ్చి పెట్టనున్నది. వచ్చే మూడేళ్లలో ఆటోమొబైల్ రంగం అస్తవ్యస్తం కావడానికి కారణమవుతుందని పారిశ్రామిక నిపుణులు పేర్కొంటున్నారు.

బ్లాక్ చైన్ టెక్నాలజీతో వచ్చే మూడేళ్లలో ఆటోమొబైల్ రంగానికి గడ్డుకాలం పొంచి ఉన్నదని ప్రపంచంలోని ఆటోమొబైల్ రంగ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా రంగాలతోపాటు ఆటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపకరిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంలో ఆటోమొబైల్ రంగం ప్రాథమిక దశలోనే ఉన్నదని ఆటో సంస్థల ప్రముఖులు పేర్కొన్నారు. 

బిజినెస్‌లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి పారదర్శకంగా, భద్రతకు మార్గదర్శిగా ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో ఫ్రిక్షన్ పాయింట్లను తొలగించడంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని సర్వేలో పాల్గొన్న 62 శాతం మంది ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. 

ఫ్రిక్షన్ పాయింట్లు పాయింట్లలో పనితీరు మెరుగుదలకు అత్యున్నత ప్రభావం చూపుతున్నది బ్లాక్ చెయిన్. వాహనాల తయారీలో ఒర్జినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్లు (ఓఈఎం), సరఫరాదారుల బిజినెస్ సమాచారం మెరుగుదలకు తమ బిజినెస్ నెట్వర్క్ మెరుగుదలకు బ్లాక్ చెయిన్ దోహదపడుతుంది. 

52 శాతం మంది ఓఈఎంలు, 40 శాతం సరపరా దారులు సమస్యలకు సంబంధించిన సమాచారం పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. మరో 43 శాతం మంది ఓఈఎంలు, 29 శాతం సరఫరా దారులు తమ శక్తి సామర్థ్యం పెంపుదలకు, సమాచారం పొందేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అవసరం అని అంచనా వేస్తున్నారు. 

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంలో చైనా, జర్మనీ, మెక్సికో వంటి దేశాలు మార్పు దిశగా ప్రయాణం సాగిస్తున్నాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వాహనాల్లో ఫ్రిక్షన్ తగ్గించి వేస్తుంది. అయితే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగం పట్ల అవగాహనలో పలు సంస్థల యాజమాన్యాలు వెనుకబడి ఉన్నాయి. 

39 శాతం మంది ఓఈఎంలు, 51 శాతం సరఫరాదారులు మాత్రం స్వల్పంగా మాత్రమే వ్యూహాల గురించి తెలుసునని చెబుతున్నారు. ఆటోమొబైల్ సంస్థలు నియంత్రణ పరమైన అవరోధాలను అధిగమించడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపకరిస్తుందని 42 శాతం ఓఈఎంలు, 33 శాతం సరఫరాదారులు పేర్కొన్నారు. 
 

click me!