టూ, త్రీ టైర్ సిటీలపైనే ‘ఆడి’ఫోకస్

By rajesh yFirst Published May 13, 2019, 11:34 AM IST
Highlights

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి ఇండియా’ తన వ్యాపార విస్తరణ కోసం వ్యూహాలు రచించింది. అందుకోసం టూ టైర్, త్రీ టైర్ సిటీస్‌కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 
 

గువాహటి: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి ఇండియా’ తమ బిజినెస్ విస్తరణ కోసం నూతన వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ప్రత్యేకించి టూ టైర్, త్రీ టైర్ పట్టణాల్లో విస్తరించడానికి వర్క్ షాప్‌లు నిర్వహించడానికి ఆడి ఇండియా ‘ఫుట్ ప్రింట్’ రూపొందించింది. 

తద్వారా దేశమంతా తన నెట్ వర్క్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని ఆడి ఇండియా అధిపతి రాహిల్ అన్సారీ తెలిపారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గత నెలలో తొలి వర్క్ షాప్‌ను నిర్వహించింది. 

‘ఆడి ఇండియా’కు దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లు లేవు. ఫలితంగా ఇంతకుముందు ఆడి కార్ల వినియోగదారులు తమ కార్ల సర్వీసింగ్ కోసం హైదరాబాద్‌కు రావాల్సి వచ్చేది. 

చిన్న పట్టణాల్లోనూ ఆడి కారు కావాలని ఆకాంక్షిస్తున్న వారి సాయంతో తమ వినియోగదారులను అటుపై తమ నెట్ వర్క్‌ను పెంచుకోవాలని ‘ఆడి ఇండియా’ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా సానుకూల వాతావరణం నెలకొని ఉన్నదని ఆ సంస్థ తెలిపింది. 

సరిహద్దుల్లోని జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని జమ్ము, అసోం రాజధాని గువాహటిలో ఆడి ఇండియా డీలర్ షిప్‌లను ప్రారంభించింది. తమ వినియోగదారుల జీవన శైలిని అప్ గ్రేడ్ చేస్తామని ఆడి ఇండియా చీఫ్ రాహిల్ అన్సారీ తెలిపారు. ఈ నగరాల పరిధిలో విక్రయాలు చాలా పరిమితం, వర్క్ షాప్‌ల నిర్వహణ ద్వారా సేల్స్ పెంచుకునే లక్ష్యంతో ఆడి ఇండియా ముందుకెళుతోంది. 
 
2014 వరకు చిన్న పట్టణాల పరిధిలో ఐదు శాతం సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా ఆడి ఇండియా ముందుకెళ్లింది. కానీ దీన్ని 25 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. మెట్రో పాలిటన్ నగరాలతోపాటు చిన్న పట్టణాల్లో సేల్స్ కూడా కీలకమేనని అంచనా వేస్తోంది ఆడి ఇండియా. 

కొన్నేళ్లుగా త్రీ టైర్ సిటీస్‌లో డబుల్ డిజిట్ సేల్స్ జరుగుతున్నాయి. 2018లో 6,463 యూనిట్ల ఆడి కార్లు అమ్ముడుపోయాయి. రాజ్ కోట్, వడోదర, గువాహటి, భువనేశ్వర్, విశాఖపట్నం నగరాల పరిధిలో అంచనాల కంటే ‘ఆడి’ కార్లు పెరుగుతున్నాయి.

click me!