మార్కెట్లోకి రెనాల్ట్‌ కొత్త క్విడ్‌ కారు.. బడ్జెట్ ధరకే

By ramya NFirst Published Feb 5, 2019, 12:13 PM IST
Highlights

ఫ్రెంచ్ ఆటోమొబైల్ మేజర్ ‘రెనాల్డ్’ సరికొత్త మోడల్ చిన్న కారు ‘క్విడ్’ను సరికొత్త భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి ఆవిష్కరించింది. దాని ధర రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షలుగా నిర్ణయించింది. భారత్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు గల మోడల్‌గా రెనాల్డ్ క్విడ్ నిలిచింది. 
 

ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త క్విడ్ మోడల్ చిన్న కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. తన ఎంట్రీ లెవల్‌ కారు రెనాల్ట్‌ క్విడ్‌లో కొత్త కారు ధరను రూ.2.67-4.63 లక్షలుగా నిర్ణయించింది, మెరుగైన భద్రతా ఫీచర్లతో దీన్ని భారతీయ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని రెనాల్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

0.8 లీటర్, ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్  ట్రాన్స్‌మిషన్ ఆప‍్షన్లలో కొత్త క్విడ్‌ లభించనున్నది. అత్యాధునిక భద్రత నిబంధనలతోపాటు, పాదచారుల భద్రతకు అనుగుణంగా తమ కొత్తకారు ఉంటుందనీ, ముఖ్యంగా యాంటీ బ్రేకింగ్ సిస్టం‌, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ తెలిపింది. 

స్పీడ్‌, ఎయిర్‌బ్యాగ్‌ రిమైండర్‌ ఫీచర్‌, 17.64 సెం.మీ టచ్‌ స్క్రీన్‌ మీడియా, నావిగేషన్ సిస్టం, కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తోపాటు ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్‌ ప్లేలకు అనుగుణంగా ఫుష్‌ టు టాక్‌ ఫీచర్‌ అందించినట్టు తెలిపింది. కాగా  2.75 లక్షలకు  పైగా యూనిట్ల అమ్మకాలతో భారత్‌ మార్కెట్‌లో రెనాల్ట్‌కు క్విడ్‌ జయప్రదమైన కారుగా నిలిచింది.

click me!