Today Rasi Phalalu: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు..!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 20.03.2025 గురువారానికి సంబంధించినవి.

Daily horoscope for March 20, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena in telugu KVG

మేష రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృషభ రాశి ఫలాలు

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామితో అకారణంగా మనస్పర్థలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో నిరాశ తప్పదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిధున రాశి ఫలాలు

Latest Videos

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి, వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో అనుకూలం. వాహనయోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొంటారు. బంధు మిత్రుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు.

సింహ రాశి ఫలాలు

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్య రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనుల్లో శ్రమ పెరుగుతుంది. స్థిరస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కదు.

తులా రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం. పాత రుణాలు కొన్నితీరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చిక రాశి ఫలాలు

శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము టైంకి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కొన్ని విషయాలు  ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చాలకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.

ధనస్సు రాశి ఫలాలు

దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు కలిసిరాదు. బంధువులతో వివాదాలు వస్తాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి.

మకర రాశి ఫలాలు

చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొందరి నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహకారం అందక ఇబ్బంది పడతారు.

కుంభ రాశి ఫలాలు

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపార, ఉద్యోగాలు లాభదాయకం. శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు చేస్తారు.

మీన రాశి ఫలాలు

దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు టైం కి పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు వస్తాయి. సొంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.

click me!