ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 21.03.2025 శుక్రవారానికి సంబంధించినవి.
ఇంటా, బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. బంధు, మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నెమ్మదిస్తాయి. ఇంటా, బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి.
వ్యాపారాలు లాభదాయకం. ప్రముఖుల సహకారం అందుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంట్లో కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆప్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు.
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆప్తుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణం. ఉద్యోగంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది.
అన్నదమ్ములతో భూ సంబంధిత వివాదాలు చికాకు తెప్పిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. విద్యార్థులను పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వ్యాపారాలు లాభదాయకం. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి.
అప్పులు వసూలు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అనుకూలం. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహనయోగం ఉంది. భూమి కూడా కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.
దూర ప్రయాణలు వాయిదా పడుతాయి. ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.
చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగడం కష్టం. కుటుంబ సభ్యులతో అకారణంగా గొడవలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం.
బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. విలువైన వస్తువులు కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
బంధువులతో అకారణంగా గొడవలు వస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.