23 ఆగస్టు 2018 గురువారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Aug 23, 2018, 9:41 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరిపాలన సమర్ధత పెరుగుతుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో అనుకూలత. సృజనాత్మకత పెరుగుతుంది. అధికారిక ఆలోచనలు అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక ప్రయాణాలు ఉంటాయి. మాతృసౌఖ్యం లోపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహార నియమాలు పాటించాలి.మానసిక ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ప్రచార, ప్రసార సాధనాల ద్వారా సంతృప్తి ఉంటుంది. అధికారిక రచనలపై దృష్టి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. అతిధి గృహాలు లాభిస్తాయి. సహోద్యోగులతో అనుకూలత ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వాక్‌ ధోరణి పెరుగుతుంది. కుటుంబంలో అధికారం కోసం ప్రయత్నం చేస్తారు. కంటి సంబంధ ఇబ్బందులు ఏర్పడతాయి. నిల్వ ధనంపై ఆలోచన ఉంటుంది. అధికారిక ఆనందాలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అధికారిక ప్రయాణాలు  ఉంటాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడడం. పాదాల సంబంధ నొప్పులు ఉంటాయి. అనుకోని భయం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారిక ఆదాయాలు ఉంటాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. దురాశ ఉంటుంది. ఉన్నతులతో పరిచయాలు. అన్ని విధాల సహకారం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉన్నతోద్యోగులతో సంబంధాలు ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్ఠలకై ఆరాటం ఉంటుంది. లభిస్తాయి. చేసే పనుల్లో నైపుణ్యం ఏర్పడుతుంది. ధృఢ నిశ్చయంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పరిశోధనల ద్వారా గౌరవం లభిస్తుంది. శాస్త్ర విజ్ఞానంపై దృష్టి ఉంటుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. విశాల దృక్పథం ఉంటుంది. గురువులపై గౌరవం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విద్య ద్వారా గౌరవం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

 

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనుకోని ఇబ్బందులు ఉంటాయి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. ఔషధ సేవనం చేయాలి. ఇతరులపై ఆధార పడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందుతాయి. అధికారిక ప్రయాణాలు ఉంటాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వామ్య, వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం.  పలుకుబడి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనారోగ్య భావన ఉంటుంది. ఔషధ సేవనం అవసరం. శతృవులపై విజయం ఉంటుంది. రుణాలు అనుకూలిస్తాయి. వ్యాయామం తప్పనిసరి. మానసిక ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.

 

డా. ప్రతిభ

 

ఇవి కూడా చదవండి

ఈ వారం( 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 

click me!