22 ఆగస్టు 2018 బుధవారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Aug 22, 2018, 9:19 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ఆరాటం. శతృవులపై విజయం సాధిస్తారు. అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధక శక్తిని కోల్పోతారు. ఔషధసేవనం తప్పనిసరి. వ్యాయామం తప్పనిసరి చేయాలి. ఋణాల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సృజనాత్మకత ఏర్పడుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నతవిద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విహార యాత్రలు చేయాలనే ఆలోచన ఉంటుంది.  గృహంలో అలంకరణలపై దృష్టి పెడతారు. మాతృ సౌఖ్యం లభిస్తుంది. విలాసవంతమైన ఆలోచనలు ఉంటాయి. సుగంధద్రవ్యాలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రచనలపై ఆలోచన ఉంటుంది. ప్రచార సాధనాలు అనుకూలిస్తాయి. ప్రసార సౌకర్యాలు ఉంటాయి. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరామర్శలు జరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వాక్‌ చాతుర్యం ఉంటుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం. నిల్వ ధనం పెంచుకోవాలనే ఆలోచన. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అభిరుచుల్లో మార్పులు ఉంటాయి. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శారీరక శ్రమతో చాలా పనులు సాధిస్తారు. కళాత్మకంగా వ్యవహరిస్తారు. ఆకర్షణశక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్య సాధన శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కళలపై ఆసక్తి. కళాకారులకు అనుకూల సమయం. విలాసాలకోసం ఖర్చులు. విహార యాత్రలపై దృష్టి. విశ్రాంతి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : స్త్రీల ద్వారా ఆదాయం. కళా నైపుణ్యం పెరుగుతుంది. సమిష్టి కార్య కలాపాలు సాగుతాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. దురాశ ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు. అధికారులతో సంతోషం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం. ఋణాలకై ఆరాటం. సామాజిక అభివృద్ధి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొంటారు. సజ్జన సాంగత్యం ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. ఉన్నత విద్యల ద్వారా గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనల్లో చికాకులు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. చెడు మార్గాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది.శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

 

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత. భాగస్వామ్య ఒప్పదాలు సంతోషం. నూతన పరిచయాలు అభివృద్ధి. సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. వ్యాపార ధోరణి పెరుగుతుంది. కళారంగంపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

డా.ప్రతిభ

 

ఇవి కూడా చదవండి..

 

ఈ వారం( 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

click me!