
సంఖ్యా శాస్త్రం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. ఏ తేదీల్లో పుట్టినవారు ఎలా ప్రవర్తిస్తారు? ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు? వంటి విషయాలను అంచనా వేయచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1 నుంచి 10వ తేదీ వరకు జన్మించిన వ్యక్తుల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
1 వ తేదీలో పుట్టిన వ్యక్తులు
ఏ నెలలో అయినా 1వ తేదీన పుట్టిన వ్యక్తులు స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టినవారు ఎవ్వరి కిందా పనిచేయడానికి ఇష్టపడరు.
2వ తేదీలో జన్మించిన వారు..
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా సున్నితంగా ఉంటారు. వీరు తమకి నచ్చిన వారి దగ్గర అటెన్షన్ ని కోరుకుంటారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఈ స్వభావమే వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. వీరికి సంగీతమంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది.
3వ తేదీలో పుట్టిన వ్యక్తులు
ఈ తేదీల్లో పుట్టినవారు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఏ పనిచేసినా అందరిని త్వరగా ఆకట్టుకుంటారు. వీరిని ఇతరులు ఇన్సిపిరేషన్ గా తీసుకుంటారు.
4వ తేదీన జన్మించిన వారు..
ఈ తేదీల్లో పుట్టినవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. నిజాయితీగా బ్రతకడానికి ఇష్టపడతారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. కుటుంబం కోసం ఏమైనా చేస్తారు.
5 వ తేదీలో పుట్టిన వ్యక్తులు
వీరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. టైం దొరికితే టూర్ కి వెళ్లాలని చూస్తారు. ఎవ్వరితో అయినా సరే వీళ్లు ఈజీగా కలిసిపోతారు.
6 వ తేదీన జన్మించిన వారు..
వీరు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. ఇతరులను ఈజీగా అర్థం చేసుకుంటారు.
7వ తేదీలో పుట్టిన వ్యక్తులు
వీరికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ దేవాలయాలు సందర్శిస్తుంటారు. వీరి సామర్థ్యంపై వీరికి నమ్మకం ఎక్కువ. సందర్భానుసారం వారి తెలివితేటలను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంటారు.
8వ తేదీన జన్మించిన వారు..
వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఏ వ్యాపారంలో అయినా దూసుకుపోతారు. కొత్తగా ఆలోచిస్తారు. చాలా ప్రాక్టికల్ గా వ్యవహరిస్తారు. జీవితంపై మంచి అవగాహన కలిగి ఉంటారు.
9వ తేదీన పుట్టిన వ్యక్తులు
ఈ తేదీల్లో పుట్టిన వారు ఆదర్శవంతంగా జీవిస్తారు. వీరికి జాలి, దయ ఎక్కువ. నా అనుకున్న వారికోసం ఏం చేయడానికైనా వెనకాడరు.
10 వ తేదీలో పుట్టిన వ్యక్తులు
ఈ తేదీల్లో పుట్టిన వారు స్వేచ్ఛను కోరుకుంటారు. చాలా కష్టపడి పనిచేస్తారు. తెలివితేటలు ఎక్కువ. ఏ రంగంలో అయినా విజయం సాధించే కెపాసిటీ కలిగి ఉంటారు.