
భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రం ఒక కీలకమైన స్థానం కలిగి ఉంది. ఇది గృహ నిర్మాణం, దిశలు, స్థానం వంటి అంశాలపై ఆధారపడి, జీవన శైలిలో సామరస్యం, శ్రేయస్సును అందించే సూత్రాలను అందిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం డబ్బును ఇంట్లో ఎక్కడ ఉంచుతున్నామనే విషయం.. మన ఆర్థిక స్థితిపై భారీ ప్రభావం చూపగలదు.
డబ్బు ఎక్కడ దాచి పెట్టాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు నిల్వ చేసేందుకు ఉత్తరం, ఈశాన్య దిశలు అత్యంత శ్రేయస్కరమైనవి. ఈ దిశల్లో డబ్బు పెట్టడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఇంట్లో శుభాలు ఎక్కువగా జరుగుతాయి.
టాయ్ లెట్ దగ్గర డబ్బులు పెడితే..?
మీ డబ్బును టాయిలెట్ లేదా బాత్రూమ్ పక్కన ఉంచడం వాస్తు ప్రకారం శుభ సూచకం కాదు. టాయిలెట్లను తేమతో నిండిన ప్రదేశాలుగా పరిగణిస్తారు. ఈ బాత్రూమ్ గోడల పక్కన డబ్బు పెట్టడం వల్ల ఆర్థిక నష్టాలు, అనవసర ఖర్చులు, మనశ్శాంతికి భంగం కలగవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
దక్షిణ దిశ
వాస్తు ప్రకారం దక్షిణం , నైరుతి దిశలు యముడి దిశలు అని పరిగణిస్తారు. ఈ దిశలలో సంపదను నిల్వ చేస్తే, అది పేదరికం, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ దిశలో డబ్బులు ఉంచకూడదు.
ఈ వాస్తు సూచనలు యుగయుగాలుగా అందరూ ఆచరిస్తూ వస్తున్నారు. ఇవి కచ్చితమైన నియమాలు కాకపోయినా, మన జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంలో దోహదపడతాయి. ఇవి వ్యక్తిగత నమ్మకాలకు అనుగుణంగా పాటించగల మార్గదర్శకాలు మాత్రమే.