వికారినామ సంవత్సర తులరాశి ఫలితాలు

Published : Apr 05, 2019, 02:33 PM IST
వికారినామ సంవత్సర తులరాశి ఫలితాలు

సారాంశం

తెలుగు సంవత్సరాదిలో తులరాశివారి ఫలితాలు

తుల : (చిత్త 3,4 పా. స్వాతి, విశాఖ 1,2,3 పా) : ఆదాయం - 8, వ్యయం - 8; రాజపూజ్యం - 7, అవమానం - 1;

          ఈ రాశివారికి గురువు సంవత్సరాంతం వరకు ద్వితీయంలో సంచారం ఉంటుంది. వీరి వాక్‌ చాతుర్యం పెరుగుతుంది.  కుటుంబంలో గౌరవాదులు వృద్ధి చెందుతాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. గౌరవాదులు వృద్ధి చెందుతాయి. వత్సరాంతం తరువాత తృతీయ సంచారం వలన  తమకంటే ఉన్నతులతో స్నేహానుబంధాలు పెంచుకుటాంరు.

పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం పెరుగుతుంది. శని 24 జనవరి 2020 వరకు తృతీయంలో సంచారం ఉంటుంది. సేవకజన సహకారం పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. సంతానం విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. జనవరి 2020 తర్వాత చతుర్థ సంచారం ఉంటుంది. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు.

శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఏ పనుల్లోనైనా ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొంత పనుల్లో ఆలస్యం అవుతుంది. పనులను వాయిదా చేయరాదు. రాహువు నవమ సంచారం వలన దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు శ్రమతో ఫలితాలు సాధిస్తారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఎదుటివారిపై విజయం సాధించడానికి చాలా కష్టపడతారు.

 

ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః

ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు :  సింహం, ధనుస్సు, మీనం

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

 

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

సింహరాశి ఫలితాలు

కన్యారాశి ఫలితాలు

కేతువు తృతీయ సంచారం వలన సహకారం లభించినా తృప్తి ఉండదు. రచనలపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. దగ్గరి ప్రయాణలు చేస్తారు. వీరికి విష్ణుసహస్రనామ పారాయణ, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

 

PREV
click me!

Recommended Stories

Leo Horoscope 2026: కొత్త సంవత్సరంలో సింహ రాశి జాతకం, కనక వర్షం కురవనుందా?
Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం