వికారినామ సంవత్సర సింహరాశివారి ఫలితాలు

By ramya NFirst Published Apr 5, 2019, 11:53 AM IST
Highlights

తెలుగు సంవత్సరాదిలో సింహరాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా) : ఆదాయం - 8, వ్యయం - 14; రాజపూజ్యం - 1, అవమానం - 5;

          ఈ రాశివారికి ఈ సంవత్సరం నవంబర్‌ 4 వరకు గురువు చతుర్థంలో, సంవత్సరాంతం తరువాత గురువు పంచమంలో సంచారం ఉంటుంది. గురువు చతుర్థ సంచారం వలన వీరికి సౌకర్యాలు ఒత్తిడితో పూర్తి చేసుకుటాంరు. సౌకర్యాలను పూర్తి చేసుకోవడం కోసం ఖర్చులు పెడతారు. ఈ సౌకర్యాలను పెంచుకోవడం కోసం కొంత అవమానాలను భరిస్తారు.      గృహ, ఆహారాదులకోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకై ఖర్చు పెడతారు. వత్సరాంతంలో గురువు పంచమంలో సంచరించడం వలన సంతాన సంబంధ ఆలోచనల్లో ఆనుకూలత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. పెట్టే ఖర్చులు వృథా కాకుండా చూసుకుటాంరు. ఆధ్యాత్మిక చింతన పెరుగతుంది. సంతృప్తి లభిస్తుంది. శని 2020 జనవరి వరకు పంచమంలో సంచారం  వలన సృజనాత్మకత తగ్గుతుంది. కూర్చుండి చేసే పనులవైపు ఆలోచన పెరుగుతుంది. ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. షష్ఠసంచారంలో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సేవకజన సహకారం  లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. రాహువు లాభంలో సంచారం వలన వీరికి అత్యాశ ఎక్కువగా ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. వాటి జోలికి వెళ్ళకూడదు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కేతువు పంచమ సంచారం వలన అనాలోచిత ఖర్చులు చేస్తారు. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఏదైనా పని చేసేముందు ఎదుటివారి సలహా అడిగి పనులు ప్రారంభించడం మంచిది. వీరికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున దాచుకోవాలనే ఆలోచన ఏరకంగా ఉండకూడదు. దాచుకున్నవి కూడా తీసి దానం చేయాలి. లేకపోతే గౌరవం తగ్గిపోవడం, వివాహాల వల్ల ఒత్తిడి మొదలైనవి ఇవే కాకుండా  ఏవైనా జరగవచ్చు. వీరు దుర్గాస్తోత్ర పారాయణ, శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

 

ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః

ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు :  సింహం, ధనుస్సు, మీనం

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

 

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

click me!