2019లో వృశ్చిక రాశివారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ద్వితీయ పంచమాధిపతి గురుడు లగ్నంలో, తృతీయ చతుర్థాధిపతి శని ద్వితీయంలో, నవమంలో రాహువు, తృతీయంలో కేతువు ఉన్నారు. మార్చ్ తర్వాత అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు ఉంటారు.
ఉద్యోగస్తులు ఏవో పనులపై వేరు వేరు ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళే చోట కొత్త ఒత్తిడి ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తమను తాము నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. వీరికి కొంత బద్ధకం పెరుగుతుంది. లావుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిని కూర్చోకుండా ఏదైనా పని చేసుకుంటూ ఉండాలి. కూర్చునే పనులకన్నా కూడా తిరిగే పనులు ఎక్కువగా చేయాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వీరికి పనులు చేయడం కన్నా కూడా సలహాలు ఇవ్వడం ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది.
undefined
వీరికి ఏలినాటి శని ఉంటుంది. మాట విలువ తగ్గుతుంది. మ్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనవసర ఇబ్బందులు వస్తాయి. నిల్వ ధనాన్ని కోల్పోయే అవకాశం. వీరు ఎక్కువగా మ్లాడకుండా ఎదుటివారిని మ్లాడడానికి అవకాశాన్ని కల్పించాలి. మాటల వల్ల అపార్థాలు వస్తాయి. కిం సంబంధ లోపాలు కూడా ఉంటాయి. వీరు నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి.
దూర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలుఉంటాయి. మార్చి తర్వాత నుంచి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొత్తవారితో జాగ్రత్తగా మెలగాలి.
సహకారాలు లోపం ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు చేయాలనుకుని ఆలోచనలు చేస్తూ ఉంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు ఉంటాయి. మార్చి తర్వాత నుంచి మాటల్లో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు అపార్థం చేసుకుని తమని నిందించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది.
వీరు ఎక్కువగా ప్రాణాయామం, యోగాసనాలు చేయాలి. లేదా ప్రతీరోజూ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినా మంచిదే. శివుని అభిషేకం చేయడం, ప్రతి 15 రోజులకు ఒకసారి ఒంటికి నూనె పెట్టుకుని మర్దనా చేసుకోవాలి. ఎప్పికి శరీరంలోని మలినాలను బయికి పంపించే ప్రయత్నం చేయాలి. పద విద్యార్థులకు పుస్తకాలను పంచడం మంచిది. ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశుపక్షాదులకు ఆహారం వేయాలి.
ఈ రాశివారికి మొత్తం పై అన్ని గ్రహాలకి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం మొత్తం అంతా ఒత్తిడి అధికంగానే ఉంటుంది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ
ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి
నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...
నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి
న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి
నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు
నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు
న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు
నూతన సంవత్సరంలో తులరాశి వారి రాశిఫలాలు