న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Dec 31, 2018, 1:46 PM IST

నూతన సంవత్సరంలో కన్య రాశివారికి ఎలా ఉండబోతోందంటే...


కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : చతుర్థ సప్తమాధిపతి గురుడు తృతీయంలో, పంచమ షష్ఠాధిపతి శని చతుర్థంలో, లాభంలో రాహువు, పంచమంలో కేతువు ఉన్నారు. మార్చి తర్వాత దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు ఉంటారు.

వీరికి సహకారం తీసుకోవడం వల్ల కష్టాలు వస్తాయి. పెద్దల సహకారం అంత తొందరగా లభించదు. విద్యార్థులకు ఒత్తిడి కొంత ఎక్కువగానే ఉంటుంది. చదువుకునే సమయంలో సౌకర్యాల వైపు ఆలోచనలు వెళతాయి. దగ్గరి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. పరామర్శలు ఉంటాయి. వీరికి కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. పరాక్రమం ఉంటుంది. ఎన్ని పనులు చేసినా వాటిలో అనుకున్నంత గుర్తింపు, కావలసిన విజయం సాధించలేరు. సంతృప్తి కూడా తక్కువగా ఉంటుంది.

Latest Videos

undefined

అనారోగ్య సూచనలు ఉన్నాయి. కడుపుకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీరు తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. తొందరపాటు పనికిరావు. ఆహారంలో ద్రవపదార్థాలు చాలా ఎక్కువగా ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. సౌకర్యాల వల్ల అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉంటాయి. అనుకున్న సమయానికి సౌకర్యాలు లభించవు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. మాతృవర్గీయులతో జాగ్రత్తగా ఉండాలి.

లాభాలు దుర్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకుంటారు. మార్చి తర్వాత వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ హాని ఉండవచ్చు. అధికారులతో అప్రమత్తత అవసరం. తోటి ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సంతాన సమస్యలు వచ్చే సూచనలు. సంతానం విషయంలో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. వారు చేసే పనులు వీరికి అంత సంతృప్తికరంగా ఉండవు. సంతానం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. మార్చి తర్వాత నుంచి సౌకర్యాలు అంత అనుకూలించవు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సౌకర్యాలపై దృష్టి తగ్గించుకోవాలి.

ఈ రాశివారు బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టాలి. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

ఈ రాశివారికి మొత్తంమీద అనుకూలత తక్కువగా ఉంటుంది. అన్ని గ్రహాలకు సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా శ్రద్ధతో చేసుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

click me!