
Gajakesari Rajyogam: జ్యోతిష్య శాస్త్రంలో గురు, చంద్రులకు ప్రత్యేక స్థానం ఉంది. మనస్సు, భావోద్వేగాలకు కారకుడిగా భావించే చంద్రుడు.. జ్ఞానం, మార్గదర్శకత్వం, అభివృద్ధికి కారకంగా భావించే గురువుతో కలిసి త్వరలో ప్రత్యేక యోగాన్ని ఏర్పరచనున్నాడు. అదే గజకేసరి రాజయోగం. ఈ రాజయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారు ఊహించని ఆర్థిక లాభాలు పొందనున్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు.
చంద్రుడు.. జూన్ 24న రాత్రి 11:45 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 27 వరకు అక్కడే ఉంటాడు. ఒకే రాశిలో గురువు, చంద్రడు కలవడం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక వృద్ధి, సామాజిక గుర్తింపు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశివారికి రెండవ ఇంటిలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశివారి ఆదాయం వేగంగా పెరగవచ్చు. వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం కలిసివస్తుంది.
అత్తమామలతో మీ సంబంధం బలపడుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితుల సాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు.
మిథున రాశి
మిథున రాశివారి వివాహ స్థానంలో గురు, చంద్ర యుతి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయాలు సంతృప్తినిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
సమాజంలో పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా మంచి స్థానం దక్కుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఊహించని విధంగా డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఉద్యోగంలో పనిభారం తగ్గుతుంది. అయితే తోటివారితో సఖ్యతగా ఉండటం మంచిది. బంధుమిత్రుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
తుల రాశి
తుల రాశివారికి తొమ్మిదవ ఇంటిలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధార్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. దైవ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పాత పెట్టుబడుల నుంచి ఆదాయం లభిస్తుంది. కష్టానికి, అదృష్టం తోడై.. ఆశించిన లాభాలు పొందుతారు. ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల సహకారం లభిస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. పిల్లల నుంచి సంతోషకర వార్తలు వింటారు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. నిర్మాణ పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.