
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం జులై నుంచి నవంబర్ వరకు వక్ర గమనంలో ఉంటుంది. జులై 13న వక్ర గమనం ప్రారంభమై, నవంబర్ 28న తిరిగి మామూలు స్థితికి వస్తుంది. శని వక్ర గమనంలో ఉన్నప్పుడు దాని శక్తి కొన్ని రాశులవారికి ఆత్మపరిశీలన, కర్మ ఫలితాలు, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ సమయం సరైన దిశలో పనిచేసేవారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరి శని ప్రభావంతో ఏ రాశులకు మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి శని వక్ర గమనం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ పనితీరుతో గుర్తింపు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు.
మకర రాశి
మకర రాశివారు శని సాడే సతి ప్రభావానికి గురవుతారు. కానీ వక్ర స్థితిలో ఉన్న శని కొంత మేలు చేస్తాడు. వృత్తిలో సానుకూల ప్రభావం, పురోగతి కారణంగా జీవనశైలి మారుతుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపార పర్యటన లాభదాయకంగా ఉంటుంది. వృథా ఖర్చులను తగ్గించుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. కానీ తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశివారు శని అనుగ్రహంతో ప్రయోజనకర ఫలితాలు పొందే అవకాశం ఉంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. మనసుకు సంతోషాన్ని ఇచ్చే వార్తలు వింటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ బలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి. ఎప్పటినుంచో ఉన్న ఓ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ సమయంలో చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి విజయాన్నిస్తాయి. కాబట్టి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు.