ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 31.03.2025 సోమవారానికి సంబంధించినవి.
బంధు మిత్రుల నుంచి విలువైన సమాచారం తెలుస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభదాయకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వింటారు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది.
వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొత్త సమస్యలు వస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం అంతంత మాత్రమే.
కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. స్నేహితుల సాయంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం.
ప్రయాణాల్లో అవరోదాలు వస్తాయి. విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. మిత్రులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.
ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు.
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. ఉద్యోగులకు అనుకూలం.