Today Rasi Phalalu: ఈ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలే లాభాలు..!

Published : Mar 29, 2025, 05:00 AM IST
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలే లాభాలు..!

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 29.03.2025 శనివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

పిల్లలు కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.

వృషభ రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. నిరుద్యోగులకు కలిసిరాదు. వ్యాపార, ఉద్యోగాలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మిథున రాశి ఫలాలు

పాత అప్పులు తీరుతాయి. కొత్త పరిచయాల వల్ల ఆర్థికంగా లాభం వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలం.

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం వింటారు. ఆదాయం అంతత మాత్రమే. ఒక విషయంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు వస్తాయి. ఉద్యోగంలో తొందరపాటు మంచిది కాదు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి.

కన్య రాశి ఫలాలు

డబ్బు విషయాల్లో చిన్నపాటి  ఇబ్బందులు వస్తాయి. పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విధంగా విభేదాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రమే. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

తుల రాశి ఫలాలు

కీలక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. అవసరాలకు డబ్బు సహాయం అందుతుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాల్లో అన్నదమ్ములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి కీలక సమాచారం వింటారు. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు రాశి ఫలాలు

వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి ఫలాలు

కొన్ని పరిస్థితులు చికాకు తెప్పిస్తాయి. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో డాక్టర్ సలహా అవసరం అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసిరావు.

కుంభ రాశి ఫలాలు

ఆర్ధికంగా అనుకూలం. పాత రుణాలు తీరుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలకు కార్యరూపం వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. అన్నదమ్ముల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు ప్రమోషన్స్ రావడం గ్యారెంటీ
Today Rasi Phalalu: నేడు ఈ 2 రాశులవారికి ఆకస్మిక ధన లాభం.. ప్రముఖులతో పరిచయాలు!