ఉగాది పండగ రోజున ఏ రాశి వారికి ఎలా ఉండనుందో ఇక్కడ తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 30.03.2025 ఆదివారానికి సంబంధించినవి.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త సమస్యలు వస్తాయి.
చేపట్టిన పనుల్లో అవాంతరాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు కొంత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి. ఉద్యోగంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు సాధారణం.
చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి.
బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసివస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.
కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. చేపట్టిన పనులు టైంకి పూర్తికావు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రావు. ఆదాయ మార్గాలు గందరగోళంగా ఉంటాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకం.
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. మిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
సన్నిహితుల నుంచి అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. వ్యాపార సంబంధ వ్యవహారాల్లో ఆటంకాలు వస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రమే. దైవ చింతన పెరుగుతుంది.
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు తెప్పిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో కొత్త సమస్యలు వస్తాయి.
ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. వాహనయోగం ఉంది. పిల్లల విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభదాయకం.
శత్రువులకు సైతం సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకం. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి.